

No.1 Short News
Newsreadగోల్డ్ ప్రియుల కొంపముంచిన ట్రంప్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలు ఇవే.
బంగారం ప్రియులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. నిన్న (శుక్రవారం) బంగారం ధర భారీగా తగ్గింది.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గబోతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ బంగారం ధరకు రెక్కలొచ్చాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 57డాలర్లు పెరిగింది. దీంతో మళ్లీ ఔన్సు గోల్డ్ 4వేలు దాటింది. తాజాగా.. 4,017 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఇవాళ కూడా రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలకు చేరువులో ఉంది
Latest News
11 Oct 2025 10:30 AM