

No.1 Short News
Newsreadవైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా భావించాలని ఆర్ఎంపీలకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు
దర్శి To కురిచేడు రోడ్ లోని చలివేంద్ర కొండ వద్ద ఆర్ఎంపి & పి.ఎం.పి ప్రజా వైద్యుల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాలుకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ...
పేరులోనే ప్రజా వైద్యం ఉంది ఆ పేరును మనం నిలుపుకోవాలన్నారు. గ్రామాలలో ఆర్ఎంపీలు ప్రాణదాతలు అన్నారు. ప్రతి ఒక్కరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మీరే గుర్తొస్తారని ఆమె వివరించారు. అందుకు అనుగుణంగా నేను ఒక డాక్టర్ గా మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను ఆర్ఎంపీలు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని తద్వారా గ్రామాలలో ప్రజా ఆరోగ్య సేవతో పాటు మన ఉపాధి కూడా ఉంటుందన్నారు అంతేకానీ ఎలాంటి వృత్తి పుణ్యత లేకుండా కొందరు ఆర్ఎంపీలు డబ్బు కోసం ఈ వృత్తిలోకి వస్తున్నారని అది చాలా బాధాకరమని అలాంటి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. జబ్బులు గుర్తించడం చిన్నచిన్న వైద్య సేవలు అందించి మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్ పట్టా పొందిన ఉన్నత మైన డాక్టర్ల వద్దకు పంపించాలని ప్రజల ప్రాణాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కమిషన్ల కోసం వృత్తి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ఆమెతో పలికారు. ప్రతి గ్రామంలో ఆర్ఎంపీలు అంటే ఎంతో గౌరవభావం ఉంటుందని వారిని వారి ప్రాణదాతలుగా పరిగణిస్తారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క ఆర్.ఎం.పి ఒక గ్రామ ప్రాణదాతగా ప్రజా సేవకులుగా తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరారు. మీ అందరి అభివృద్ధి సంక్షేమం కోసం మీరు అడగగానే ఈ భవనానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం జరిగిందని ఆమె వివరించారు. ప్రతి ఇంటికి మీరు వెళుతుంటారు ప్రతి వారి బాగోగులు తెలుసుకుంటారు మీరు మన కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను మనం ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర అభివృద్ధిలో మీరంతా భాగస్వామిలు అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు, వైద్య ఆరోగ్యశాఖ మార్చిలు సత్య కుమార్ యాదవ్ గారు కృషిని ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని అభివృద్ధికి అందరూ సమిష్టిగా సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు మీకే తెలుస్తుందని మీరు గ్రామంలోని సమస్యలకు నాకు వారదులుగా నిలవాలని ప్రతి సమస్యను నా దృష్టికి తేవాలని ప్రతి ఒక్కరూ నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలని ఆరోగ్యంతో పాటు సమాజ సేవలో ప్రతి వైద్యుడు సైనికుల్లాగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మరీ మరీ చెబుతున్నాను ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజా వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, ఆర్ఎంపీ స్టేట్ అధ్యక్షులు : గోవింద రాజు, నాగేశ్వర రావు, ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులు : కృష్ణ రెడ్డి, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, నియోజకవర్గం లోని ఆర్ఎంపీలు డాక్టర్లు అందరూ పాల్గొన్నారు.