

No.1 Short News
Newsreadకందుకూరు: భారీ వర్షాల ప్రభావంతో రాళ్ల వాగు ఉధృతి
మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడ్లూరు మండలం పొట్లూరు–గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించవద్దని ఎస్ఐ వెంకట్రావు హెచ్చరిక జారీ చేశారు. దీంతో కందుకూరు–కావలి రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
Latest News
28 Oct 2025 19:19 PM