

No.1 Short News
Newsreadఉల్లగల్లు లో తుఫాన్ ఎఫెక్ట్: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఉల్లగల్లులోని ప్రధాన రహదారిలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేనందున వర్షపు నీరంతా నిలిచి ఇళ్లలోకి చేరింది. సాధారణ వర్షపాతానికి కూడా ఈ వీధిలో వర్షపు నీరు నిలువ ఉంటుంది అలాంటిది ఇలాంటి తీవ్రమైన తుఫానులలో ఇంకా ఎంత నీరు చేరబోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిలో గల డ్రైనేజీలో చెత్తను తొలగిస్తే ఈ సమస్య ఉండదని ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిలువ ఉండటం వల్ల నీరు ఎటు పోకుండా రోడ్లలో నిలిచిపోయి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
Latest News
29 Oct 2025 07:50 AM