

No.1 Short News
Newsreadదర్శి అభివృద్ధి కి డా|| లక్ష్మీ నిబద్దత,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి వినతి
గత 18 నెలలుగా దర్శి అభివృద్ధి కోసం నిరంతరం పరిగెడుతున్న దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, నియోజకవర్గ ప్రజల ప్రధాన డిమాండ్ అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం కోసం సుమారు ₹2 కోట్లు నిధులు మంజూరు చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ప్రకాశం జిల్లాలో దర్శి కొనసాగింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి లో రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు.
అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని గ్రామాగ్రామం పర్యటిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ, యువత కోసం ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే దిశగా కృషి చేస్తూనే ఉన్నట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
Latest News
27 Nov 2025 16:22 PM