No.1 Short News

Newsread
ఉత్తమ పౌరులుగా ఎదగడానికి వ్యక్తిత్వ వికాసం–నైతిక విలువలు కీలకం
దర్శిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రత్యేక విద్యా దినోత్సవం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాద్యాయులు ఖాదర్ మస్తాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కె. యలమందారెడ్డి, కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి బాలికలే రేపటి నవభారత నిర్మాతలని, నైతిక విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతతో సబలంగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం, సేవాతత్పరతను అలవరచుకోవడం విద్యార్థుల నిజమైన పురోగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
02 Dec 2025 18:20 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.