No.1 Short News

Newsread
అభిమాన నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా
దర్శి నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందిస్తున్న యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జన్మదినం ముందస్తు వేడుకలు జిల్లాలో సందడి చేశాయి. ఆయన తిరుపతి దర్శనానికి వెళుతున్న సంగతి తెలిసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నరసరావుపేటలోని ఆయన నివాసానికి చేరుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవానికి న్యాయం జరిగితేనే నా అసలు జన్మదినం అని భావిస్తున్న డాక్టర్ కడియాల, దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అండగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా, కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చేందుకు అండగా నిలవాలని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, దొనకొండ మండలాల నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
02 Dec 2025 19:46 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.