No.1 Short News

Newsread
వక్ఫ్ యాక్ట్ అమలు ఎక్కడ ? అబ్దుల్ సత్తార్
వారసత్వ మసీదులను కాపాడడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌డిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6ను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో గోరంట్ల సర్కిల్‌ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 6 భారత చరిత్రలో రెండు విషాద సంఘటనల రోజు అని చెప్పారు. అదే రోజు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరివాణం బాబ్రీ మసీదు ధ్వంసం… భారత వారసత్వానికి మిగిల్చిన నెగెటివ్ ముద్ర భారతీయులమనుకుంటూ మైనార్టీలపై గుంపు దాడులు, ప్రార్ధనా స్థలాలపై దాడులు, మహిళలను అవమానించటం… ఇలా ప్రజాస్వామ్యాన్ని ఛేదించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు. ప్రజలు ఆకలి, నిరుద్యోగంతో ఆందోళన చెందుతుంటే… కోట్ల రూపాయలు విగ్రహాలు, ఆలయాలకు ఖర్చు చేస్తూ మత పేరుతో మూఢనమ్మకాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వక్ఫ్ సవరణలపైనా ఆయన మండిపడ్డారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా ఉమ్మీద్ యాప్‌కు గడువు పెట్టడం అన్యాయమని… ముస్లింలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. వక్ఫ్ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అబ్దుల్ సత్తార్ చేసిన ప్రధాన డిమాండ్లు: ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ముస్లింల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. వక్ఫ్ ఉమ్మీద్ యాప్ గడువు పొడగించాలి. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా కార్మిక నాయకులు పఠాన్ సాజిద్ ఖాన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖాజా వలి, బ్రాంచ్ అధ్యక్షులు షఫీగని, అబ్దుల్ రజాక్, ఖాదర్ భాషా, మహమ్మద్ సాధ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Dec 2025 14:35 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.