

No.1 Short News
Newsreadమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, సేకరించిన సంతకాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు.
Latest News
15 Dec 2025 19:50 PM