

No.1 Short News
Newsreadదర్శి సర్కిల్‌లో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్‌లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Latest News
17 Dec 2025 20:44 PM