No.1 Short News

Newsread
ప్రాణాలే ప్రథమ లక్ష్యం: నిద్ర మత్తుపై ప్రకాశం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు అర్థరాత్రి వేళ ప్రత్యేక ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై రాత్రి 1 గంట నుంచి ఉదయం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి, డ్రైవర్లు నిద్ర మత్తు దూరం చేసుకోవడానికి ముఖం కడుక్కోవడం, టీ తాగడం ద్వారా అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ భద్రతను గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత కోసం ఇలాంటి ప్రజా భద్రతా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.
20 Dec 2025 11:36 AM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.