No.1 Short News

Newsread
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్‌గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
20 Dec 2025 16:19 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.