

No.1 Short News
Newsreadఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన లిఫ్ట్ ప్రారంభం
ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్యంగా హాజరయ్యారు.
అలాగే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్, టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్సన్ బాబు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు మహిళలకు సౌకర్యంగా ఉండేలా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అని నాయకులు పేర్కొన్నారు.