No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా – దర్శిలో కార్డన్ & సెర్చ్, 67 బైక్‌లు స్వాధీనం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం పోలీసులు అకస్మికంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, దర్శి డిఎస్పి బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. సీఐలు, ఎస్సైలు సహా 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. తరువాత “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, యువత, ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి–డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Latest News
08 Jan 2026 14:22 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.