No.1 Short News

Newsread
రెడ్డి నగర్–బసాపురం రోడ్డుకు నిధులు: పవన్ కళ్యాణ్ వేగమే ప్రత్యేకం
రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు–పవన్–లోకేష్ కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని Dr. లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గంలో 19 నెలల్లో దాదాపు రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు. తరువాత లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన Dr. లక్ష్మీ. కార్యక్రమంలో టిడిపి–జనసేన–బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Latest News
23 Jan 2026 22:44 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.