

No.1 Short News
Newsreadవైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత కడియాల వెంకటేశ్వరరావు
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్తను అరెస్టు చేయించిన ఘటనను గుర్తు చేసిన టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు,
నేడు అదే తరహా వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై జరిగితే, అంబటి రాంబాబును పరామర్శించడమే సరైనదా? అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదేనా మీ రాజకీయ సంస్కారం? ఇదేనా మీ రాజకీయ విధానం? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కడియాల వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Latest News
31 Jan 2026 22:23 PM