

No.1 Short News
Newsreadతిరుమలలో దేవుని ముందు లక్కీ డ్రా రీల్స్.. యువకులు అరెస్ట్
తిరుమల ఆలయం ముందు “లక్కీ డ్రాలో బీఎండబ్ల్యూ కారు గెలుచుకోండి” అంటూ ఇద్దరు యువకులు రీల్ వీడియో చేశారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
గోలి 4 అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడిని కారుతో సహా తిరుమలకు తీసుకొచ్చారు.
మరో వ్యక్తి నరేంద్ర ఇప్పటికే హైదరాబాద్ జైలులో ఉన్నాడు.
పవిత్ర స్థలాల్లో ఇలాంటి రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
Latest News
07 Feb 2026 08:35 AM