No.1 Short News

Newsread
ఉల్లగల్లు టీడీపీ కార్యకర్త షేక్ బాజీ మృతి పట్ల నారాపుశెట్టి పాపారావు సంతాపం
దర్శి / ఉల్లగల్లు: దర్శి నియోజకవర్గంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం యువ కార్యకర్త షేక్ బాజీ (యువ కిరణం) అకాల మరణం పట్ల దర్శి మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షేక్ బాజీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని పాపారావు పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం యువతను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా నారాపుశెట్టి పాపారావు మాట్లాడుతూ, “షేక్ బాజీ అకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ఈ కష్టం నుంచి బయటపడేందుకు పార్టీ తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతునికి నివాళులర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Latest News
08 Feb 2026 15:06 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.