

No.1 Short News
Newsreadదర్శిలో రథం లాగిన గొట్టిపాటి దంపతులు, శివ నామస్మరణతో మార్మోగిన పట్టణం
మహాశివరాత్రి సందర్భంగా దర్శి పట్టణంలో శివపార్వతుల రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలంకరించబడిన రథాన్ని భక్తులతో కలిసి లాగుతూ శివభక్తిని చాటారు.
డా. గొట్టిపాటి లక్ష్మి దంపతుల పాల్గొనడంతో రథోత్సవానికి ప్రత్యేక శోభ చేకూరింది. శివనామ స్మరణతో దర్శి పట్టణ పురవీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Latest News
17 Feb 2026 13:13 PM