No.1 Short News

Newsread
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆయన ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె. నివాస్ ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తన వివరాలను నమోదు చేశారు. ఈ స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. ప్రజలు తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Latest News
16 Apr 2026 18:42 PM
2
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.