No.1 Short News

Newsread
దర్శిలో పెట్రోల్ కొరత లేదు… వదంతులకు చెక్
దర్శి పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు స్వయంగా పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ పరిస్థితిని పరిశీలించారు. బంక్ యజమానుల ప్రకారం దర్శిలో ఎటువంటి కొరత లేదని, వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని పోలీసులు సూచించారు. అదేవిధంగా ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తే Essential Commodities Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Latest News
26 Apr 2026 20:13 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.