No.1 Short News

Newsread
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పీహెచ్‌సీలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం PHCలో డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్లపై అమ్మే రంగు పానీయాలు తాగరాదని తెలిపారు. వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లగా ఉంచాలని, అపస్మారక స్థితిలో ఉంటే నీరు ఇవ్వకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
28 Apr 2026 13:44 PM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.