No.1 Short News

Newsread
ఉల్లగల్లు లో వైసీపీ నాయకుడు జిలానిని పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి
ముండ్లమూరు, జూన్ 5: ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిలాని ఇటీవల గుండెకు స్టంట్ వేయించుకుని చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిలాని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జిలాని త్వరగా కోలుకుని ప్రజా సేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
Latest News
05 Jun 2026 05:44 AM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.