

No.1 Short News
Newsreadదివంగత నేత బాలయోగి కి నివాళులు అర్పించిన గొట్టిపాటి లక్ష్మి
దేశంలోనే అత్యున్నతమైన లోక్ సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కోనసీమ ముద్దుబిడ్డ, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ గా ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకం. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ బాలయోగి ఆశయసాధనకు ప్రతిఒక్కరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
Latest News
03 Mar 2025 10:08 AM