No.1 Short News

Rasul.Sk
చీటింగ్ కేసు నమోదు
ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన బిజ్జం సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఐటిసి ఉద్యోగి దారం నాగార్జున్ రెడ్డి అనే వ్యక్తి 2023 సంవత్సరంలో బిజ్జం సుబ్బారెడ్డికి వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్ ,ట్రక్కులు, రోటవేటర్స్ మొదలగునవి సబ్సిడీ ద్వారా ఇప్పిస్తానని చెప్పి , నమ్మించి,అతని వద్ద సుమారు 08 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని, ఫిర్యాదికి సదరు వ్యవసాయ పనిముట్లు అయినా ట్రాక్టర్స్ , ట్రక్కు,రోటవేటర్ మొదలైన వస్తువులు ఇవ్వకుండా మరియు అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా మోసం చేసినట్లు అదే విధంగా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న వ్యవసాయదారు లను ఇదేవిధంగా నమ్మించి మోసం చేసి ,వారి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు ఇవ్వగా సదరు ఫిర్యాదు పై ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
Latest News
12 Mar 2025 14:06 PM
1
15