Select Location
Newsread Image

No.1 Short News

Newsread
డిప్యూటీ స్పీకర్ RRR తో డాక్టర్ గొట్టిపాటి భేటీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరు jkc కాలేజీ ఆడిటోరియంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు అభినందన కార్యక్రమంలో అతిధిగా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ RRR తో కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.
View More
Latest News
07 Nov 2025 19:56 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలు ప్రకాశం భవన్‌లో జరిగిన జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సాంఘిక శాఖ మంత్రి గౌ. డోలా బాల వీరాంజనేయస్వామి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు గారు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లాలోని ఎమ్మెల్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
View More
07 Nov 2025 19:52 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:29 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ.
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
View More
Latest News
06 Nov 2025 21:27 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్!
జోహ్రాన్ మమ్దానీ 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 34 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా, అయన ఆండ్రూ క్యూమో (స్వతంత్ర అభ్యర్థి)ను ఓడించి, 50.3% ఓట్లతో గెలిచారు. మమ్దానీ న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి ముస్లిం మేయర్ మరియు ఆధునిక కాలంలో మొదటి ఇమ్మిగ్రెంట్ మేయర్.
View More
Latest News
06 Nov 2025 11:44 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తెలుగు రాష్ట్రాల్లో ఆగని బస్సు ప్రమాదాలు
పార్వతి మన్యం జిల్లాలో ప్రమాదానికి గురైన మరో బస్సు.మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం.పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన.ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్.తప్పిన ప్రాణపాయం, మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు.విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న బస్సు అని సమాచారం.
View More
Latest News
06 Nov 2025 11:28 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
కార్తీక పౌర్ణమి మహిళల కోలాటం లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తాళ్లూరు మండలం, తురకపాలెం గ్రామం లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన లో ముఖ్య అతిధులు గా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా కోలాటం ప్రదర్శించి న 40 మంది మహిళలకు డా|| లక్ష్మీ చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో తురకపాలెం గ్రామ టిడిపి నాయకులు, తాళ్లూరు మండలం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
View More
Latest News
05 Nov 2025 22:33 PM
1
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
టీడీపీ ఓడిపోదు..! మళ్లీ మళ్లీ పవర్ లోకి వస్తాం..! చంద్రబాబులో అంత కాన్ఫిడెన్స్‌కి కారణమేంటి..
వస్తామ్. మళ్లీ మళ్లీ పవర్‌లోకి వస్తాం. అసలు టీడీపీ ఓడిపోదు. రాసి పెట్టుకోండి. గెలుపు మనదే. ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే. ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది. పవర్‌పై బాబు ధీమా వెనుక ప్లానేంటి? రాబోయే ఎన్నికలకు..ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి? అంత గట్టిగా ఓడిపోబోమని చెప్పడానికి కారణమేంటి? ఏపీలో పవర్ షిఫ్లింగ్‌ సిస్టమ్‌ నడుస్తోంది. విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైమ్‌ జగన్‌ పవర్‌లోకి వచ్చారు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ స్లైడ్‌ విక్టరీతో ఏపీని పాలిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి..అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ 2029లో అధికారం తమదేనని ధీమాగా ఉంది. సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంతే అంటున్నారు.చంద్రబాబు మాటల్లో ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్.. చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆశామాషీ కాదు. ఎందుకంటే గ్రౌండ్‌ లెవల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడూ మాట్లాడరు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో నెగెటీవ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు..పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోదు..ఇక నుంచి వచ్చే జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని..ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని బాబు చెప్పుకొస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు ప్లానింగ్..అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మీద ఎక్కడా నెగెటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యలు..ఇచ్చి హామీలు ఇలా అన్నింటిని పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా మెయింటెన్ చేస్తున్నారు. కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు.. బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని.. సంక్షేమ పథకాలు, పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్‌ పెట్టి..సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, తల్లికి వందనం, వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ..కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో 15ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు, పవన్ చెబుతున్న మాట. మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది. పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. 2024లో కూటమి దాదాపుగా 60శాతం ఓటు షేర్‌ను రాబట్టింది. ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు.గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు. సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి..మీటింగ్‌ ఏదైనా డయాస్ మరేదైనా జగన్‌ను, వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు. సేమ్‌టైమ్‌ అక్రమాలు, అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా గప్‌ చుప్‌ అయిపోయి..మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట. ఇక రాజకీయంగా వైసీపీ 2019కు ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా? ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది? అందుకు విరుగుడు ఏంటి? అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి. ఇలా తనదైన మంత్రాంగంతో..ఏపీ పొలిటికల్‌ గేమ్‌లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బాబు ధీమానే నిజం కాబోతోందా? ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో చూడాలి.
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
1
Newsread image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..
ఏపీలో జిల్లాల పునర్విభజనపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, రామానాయుడు, హోంమంత్రి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు
View More
Latest News
05 Nov 2025 20:22 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాన్‌ నష్టాలపై కలెక్టర్‌కి నివేదిక సమర్పించిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి
తుఫాన్‌ బీభత్సంతో ధ్వంసమైన రహదారులు, కాలువల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని దర్శి టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్‌ రాజబాబును కోరారు.ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో యువనేత డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌తో కలిసి ఆమె తుఫాన్‌ కారణంగా జరిగిన ఆస్తి, పంటనష్టాలపై నివేదిక అందజేశారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దర్శి ప్రాంతంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికారుల కృషిని డాక్టర్‌ లక్ష్మి ప్రశంసించారు.
View More
Latest News
05 Nov 2025 19:53 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
3.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
దొనకొండ మండలం పడమటి వెంకటాపురం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు గారి కుమారుడు శ్రీ సాయి కి ₹3,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి LOC చెక్కును దర్శి టిడిపి ఇంచార్జి డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు నరసరావుపేటలోని తన నివాసం వద్ద బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కంచర్ల శ్రీనివాసరావు, దొనకొండ మండల ఐ.టిడిపి అధ్యక్షులు వై.కే. చౌదరి పాల్గొన్నారు.
View More
05 Nov 2025 18:11 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
అల్పపీడనం.. మళ్ళీ భారీ వర్షాలు
ఈరోజు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
View More
Latest News
03 Nov 2025 09:04 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఈరోజు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, దరశిలోని స్థానిక కురిచేడు రోడ్డునందుగల శ్రీ ప్రశాంత హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్, ఉమ్మ డి ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి.శ్రీరాములుకు ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భాషా సంయుక్త రాష్ట్రాల సాధనలో భాగంగా, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, రాష్ట్ర సాధనలో భాగంగా తన ప్రాణాలర్పించిన మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములని,ఆయన త్యాగాలను, సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరువకూడదని,ప్రతి ఒక్కరూ పోరాట పఠిమగలిగి వుండాలని, అన్నీ సందర్భాలలో పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కపురం శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు.అనంతరం వ్యాసరచనలో నెగ్గిన విద్యార్థినులకు కపురం శ్రీనివాసరెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
View More
01 Nov 2025 19:18 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
Kaanipaakam : సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసంలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
కాణిపాకం....చిత్తూరు జిల్లా సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం. చిన పాపమ్మ అనే మహిళ గాయాలు. కాణిపాకం లోని హరిజనవాడలో ఘటన. బుధవారం ఉదయం వంట రూమ్ లో స్టవ్ ముట్టించగా పేలిన సిలిండర్. సిలిండర్ పేలడంతో చిన్న పాపమ్మ బట్టలకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాద ఘటనపై విచారిస్తున్న కానిపాకం పోలీసులు.
View More
Latest News
29 Oct 2025 12:59 PM
0
1
Newsread image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు లో తుఫాన్ ఎఫెక్ట్: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఉల్లగల్లులోని ప్రధాన రహదారిలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేనందున వర్షపు నీరంతా నిలిచి ఇళ్లలోకి చేరింది. సాధారణ వర్షపాతానికి కూడా ఈ వీధిలో వర్షపు నీరు నిలువ ఉంటుంది అలాంటిది ఇలాంటి తీవ్రమైన తుఫానులలో ఇంకా ఎంత నీరు చేరబోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిలో గల డ్రైనేజీలో చెత్తను తొలగిస్తే ఈ సమస్య ఉండదని ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిలువ ఉండటం వల్ల నీరు ఎటు పోకుండా రోడ్లలో నిలిచిపోయి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.
View More
Latest News
29 Oct 2025 07:50 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
తుఫాను వేళ కురిచేడు మండలంలో పర్యటించిన డా||గొట్టిపాటి లక్ష్మి
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిచేడు మండలంలోని వీరయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ఎన్ఎస్పీ కాలనీలో పొలాల నుండి నీరు ఆర్ & బి రోడ్డుపైకి చేరిన నేపథ్యంలో, డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ & బి డీఈ గోపికృష్ణ, సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డా|| లక్ష్మీ గారు అధికారులకు సూచించారు.
View More
Latest News
28 Oct 2025 19:36 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
కందుకూరు: భారీ వర్షాల ప్రభావంతో రాళ్ల వాగు ఉధృతి
మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడ్లూరు మండలం పొట్లూరు–గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించవద్దని ఎస్ఐ వెంకట్రావు హెచ్చరిక జారీ చేశారు. దీంతో కందుకూరు–కావలి రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
View More
Latest News
28 Oct 2025 19:19 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ లోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై ముఖ్యమంత్రి సమీక్ష.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్త రైల్వేలైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు- గుంతకల్, గుణదల ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్- తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతి సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
27 Oct 2025 20:03 PM
0
1
Newsread Image

No.1 Short News

BSR NEWS
కిడ్నాపైన బాలుడి జాడను గంటలో చేదించిన గుంటూరు పోలీసులు
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC కాలనీకి చెందిన షేక్.షాఫిఉల్లా నిన్న(ది.26.10.2025) మద్యాహ్నం సుమారు 01:00 గంట నుండి తన మూడు(03) సంవత్సరాల బాబు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వెంటనే సీఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో Cr.No. 319/2025 u/s 140(2) BNS of Old Guntur సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి, సదరు విషయాన్ని గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ కి తెలియపరచి, ఆయన ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టాలని ఆదేశించగా, కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబుని కిడ్నాప్ చేసినాహులను ఈ రోజు ఉదయం 08.00 గంటలకి గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి బాబుని సురక్షితంగా రక్షించి, అతని తల్లిదండ్రులకు అప్పగించడమైనది.నిందితురాలైన షకీలాని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి హాజరుపరచడమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత మరియు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో కేవలం గంటల వ్యవధిలోనే వారి బాబునీ తల్లి దండ్రులు రక్షించి,అప్పగించారని పాత గుంటూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పాత గుంటూరు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాబును రక్షించుటలో అత్యంత ప్రతిభ కనపరిచిన ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ని, పాత గుంటూరు సిఐ-కె.వెంకట ప్రసాద్ ని , యస్.ఐ-యన్.సి. ప్రసాద్ మరియు సిబ్బంది HC నూరుద్దీన్ ,PC రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.
View More
Latest News
27 Oct 2025 19:22 PM
0
1
Newsread image

No.1 Short News

Irfan Deoband
امام شعبی رحمہ اللہ (١٠٣ھ) کے سامنے ایک شخص کا ذکر ہوا کہ وہ بڑا عالم ہے۔ فرمایا: ”اس پر علم کی خوبصورتی نظر نہیں آتی۔“ پوچھا گیا : ”علم کی خوبصورتی کیا ہے؟“ فرمایا : ”سکینت؛ جب کسی کو سکھائے تو زور زبردستی نہ کرے، اور جب کوئی اسے سکھائے تو اپنی شان کے خلاف محسوس نہ کرے۔“ 📙 - (حلية الأولياء لأبي نعيم : ٣٢٣/٤)
امام شعبی رحمہ اللہ (١٠٣ھ) کے سامنے ایک شخص کا ذکر ہوا کہ وہ بڑا عالم ہے۔ فرمایا: ”اس پر علم کی خوبصورتی نظر نہیں آتی۔“ پوچھا گیا : ”علم کی خوبصورتی کیا ہے؟“ فرمایا : ”سکینت؛ جب کسی کو سکھائے تو زور زبردستی نہ کرے، اور جب کوئی اسے سکھائے تو اپنی شان کے خلاف محسوس نہ کرے۔“ 📙 - (حلية الأولياء لأبي نعيم : ٣٢٣/٤)
View More
Latest News
25 Oct 2025 06:31 AM
6
1
Newsread Image

No.1 Short News

Newsread
కర్నూలు లో బస్సు ప్రమాదానికి కారణం ఇదే..
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురై కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం శివశంకర్ అనే యువకుడు రాంగ్ రూట్‌లో బైక్‌పై రావడమే అని తేలింది. కర్నూలు సిటీ, ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ (బైకర్), అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో తన పల్సర్ బైక్‌పై హైవేపై రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టాడు. అక్టోబర్ 24 శుక్రవారం శివశంకర్‌కు పెళ్లి చూపులు ఉండగా, అంతకు ముందు రోజు అర్థరాత్రి 20 కిలోమీటర్ల దూరంలోని చిన్నటేకూరుకు అతను ఎందుకు వెళ్ళాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. బైక్‌తో ఢీకొట్టిన తర్వాత శివశంకర్ ఎగిరి దూరంగా పడ్డాడు. కానీ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుంది. బస్సు సుమారు 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లడంతో రోడ్డుపై స్పార్క్ (మంట) పుట్టింది. దీనికి తోడు డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో మంటలు భారీగా బస్సుకు అంటుకున్నాయి. ఏసీ బస్సు అద్దాలు మూసి ఉండటంతో, ప్రయాణికులు పొగ, మంటలు కమ్ముకుని ఊపిరాడక 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ శివశంకర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
View More
Latest News
25 Oct 2025 06:30 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన కనిగిరి సీఐ షేక్ ఖాజావలి
కనిగిరి కాస్మోపాలేట్ క్లబ్ నందు టెన్నిస్ ఆడుతున్న కనిగిరి పిఎసిఎస్ అధ్యక్షులు అద్దంకి రంగబాబు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడే టెన్నిస్ ఆడుతున్న కనిగిరి సీఐ ఖాజావలి ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. ప్రాథమిక వైద్య పరమైన చర్యగా సిపిఆర్ ( కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేయటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనను చూసిన సభ్యులు మరియు టెన్నిస్ పక్కనే ఉన్న కాస్మోపాలిటీ సభ్యులు మరియు టెన్నిస్ క్రీడాకారులు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తన కారులో వెంటనే అందరు కలిసి సమీపoలోని హాస్పిటల్ నందు చేర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ సరైన సమయంలో తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరు సి పి ఆర్ పి పైఅవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కిరణ్ తెలిపారు. కనిగిరి సీఐ షేక్ ఖాజావలి మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టుల అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తానని ,ఎవరైనా కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆ సమయంలో సి పి ఆర్ చేసి ప్రాణాపాయం పరిస్థితులను నుండి కాపాడవచ్చు అని సిఐ ఖాజావలి తెలిపారు.
View More
Local Updates
12 Oct 2025 07:25 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా భావించాలని ఆర్ఎంపీలకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు
దర్శి To కురిచేడు రోడ్ లోని చలివేంద్ర కొండ వద్ద ఆర్ఎంపి & పి.ఎం.పి ప్రజా వైద్యుల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాలుకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ... పేరులోనే ప్రజా వైద్యం ఉంది ఆ పేరును మనం నిలుపుకోవాలన్నారు. గ్రామాలలో ఆర్ఎంపీలు ప్రాణదాతలు అన్నారు. ప్రతి ఒక్కరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మీరే గుర్తొస్తారని ఆమె వివరించారు. అందుకు అనుగుణంగా నేను ఒక డాక్టర్ గా మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను ఆర్ఎంపీలు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని తద్వారా గ్రామాలలో ప్రజా ఆరోగ్య సేవతో పాటు మన ఉపాధి కూడా ఉంటుందన్నారు అంతేకానీ ఎలాంటి వృత్తి పుణ్యత లేకుండా కొందరు ఆర్ఎంపీలు డబ్బు కోసం ఈ వృత్తిలోకి వస్తున్నారని అది చాలా బాధాకరమని అలాంటి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. జబ్బులు గుర్తించడం చిన్నచిన్న వైద్య సేవలు అందించి మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్ పట్టా పొందిన ఉన్నత మైన డాక్టర్ల వద్దకు పంపించాలని ప్రజల ప్రాణాలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కమిషన్ల కోసం వృత్తి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ఆమెతో పలికారు. ప్రతి గ్రామంలో ఆర్ఎంపీలు అంటే ఎంతో గౌరవభావం ఉంటుందని వారిని వారి ప్రాణదాతలుగా పరిగణిస్తారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క ఆర్.ఎం.పి ఒక గ్రామ ప్రాణదాతగా ప్రజా సేవకులుగా తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని కోరారు. మీ అందరి అభివృద్ధి సంక్షేమం కోసం మీరు అడగగానే ఈ భవనానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం జరిగిందని ఆమె వివరించారు. ప్రతి ఇంటికి మీరు వెళుతుంటారు ప్రతి వారి బాగోగులు తెలుసుకుంటారు మీరు మన కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలని మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను మనం ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర అభివృద్ధిలో మీరంతా భాగస్వామిలు అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు, వైద్య ఆరోగ్యశాఖ మార్చిలు సత్య కుమార్ యాదవ్ గారు కృషిని ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని అభివృద్ధికి అందరూ సమిష్టిగా సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు మీకే తెలుస్తుందని మీరు గ్రామంలోని సమస్యలకు నాకు వారదులుగా నిలవాలని ప్రతి సమస్యను నా దృష్టికి తేవాలని ప్రతి ఒక్కరూ నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలని ఆరోగ్యంతో పాటు సమాజ సేవలో ప్రతి వైద్యుడు సైనికుల్లాగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మరీ మరీ చెబుతున్నాను ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజా వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, ఆర్ఎంపీ స్టేట్ అధ్యక్షులు : గోవింద రాజు, నాగేశ్వర రావు, ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులు : కృష్ణ రెడ్డి, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, నియోజకవర్గం లోని ఆర్ఎంపీలు డాక్టర్లు అందరూ పాల్గొన్నారు.
View More
11 Oct 2025 14:00 PM
5
1
Newsread Image

No.1 Short News

Newsread
గోల్డ్ ప్రియుల కొంపముంచిన ట్రంప్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలు ఇవే.
బంగారం ప్రియులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. నిన్న (శుక్రవారం) బంగారం ధర భారీగా తగ్గింది.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గబోతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ బంగారం ధరకు రెక్కలొచ్చాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 57డాలర్లు పెరిగింది. దీంతో మళ్లీ ఔన్సు గోల్డ్ 4వేలు దాటింది. తాజాగా.. 4,017 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఇవాళ కూడా రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలకు చేరువులో ఉంది
View More
Latest News
11 Oct 2025 10:30 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
రైల్వే ప్రయాణికులకు గమనిక.. నేటి నుంచి వారం రోజుల పాటు 32 రైళ్ల రద్దు
డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో రైల్వే లైన్ మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
View More
Latest News
11 Oct 2025 10:20 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?
ఏపీలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కింగ్ పిన్ జనార్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులో కాపు కాసి జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును గన్నవరం విమానాశ్రయం నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు పోలీసులు. అక్కడ అతడిని విచారిస్తున్నారు. కాగా, జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
View More
Latest News
10 Oct 2025 22:58 PM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
Gold Price : డబ్బులు రెడీ చేసుకోండి.. బంగారం ధరలు భారీగా పడబోతున్నాయ్.. కారణం ఇదే…
బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్ టైం గరిష్ఠ రికార్డులను నమోదు చేస్తున్నాయి. దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ప్రజలకు గోల్డ్ రేట్లు షాకిచ్చాయి. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై సుమారు రూ.2వేలు తగ్గింది. అయితే, రాబోయే కాలంలో గోల్డ్ రేటు మరింత తగ్గబోతుందని పేస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయెల్ పేర్కొన్నారు. బంగారం, వెండి ధరలు గతంలో ఎప్పుడూలేని స్థాయికి పెరిగాయి. గత 40 సంవత్సరాలలో డాలర్ ఇండెక్స్ బలహీనపడినప్పుడు మాత్రమే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, ప్రతి ర్యాలీ తరువాత.. భారీ అమ్మకాల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
View More
10 Oct 2025 22:29 PM
0
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
AP Inter Students: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు..
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ బోర్డు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇంటర్మీడియట్ 2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. వాస్తవానికి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగిసింది. అయితే గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, రెగులర్, ప్రైవేట్ అభ్యర్థులు.. గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాలి. కాగా వెయ్యి రూపాయల అదనపు రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. ఇదే చివరి అవకాశం అని, మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తేల్చి చెప్పారు.
View More
Education
10 Oct 2025 22:11 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
సామాన్యుడి నుండి అసామాన్య శక్తి గా చంద్రబాబు 15 ఏళ్ల జైత్రయాత్ర
సామాన్యునిగా రాజకీయాల్లోకి వచ్చి సంక్షోభాలను ఎదుర్కొని ముందుచూపు అభివృద్ధి సంక్షేమాలను చిరునామాగా మార్చుకొని ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ జైత్ర యాత్ర చేసిన స్పూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు కి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి ఆమె konni😄 విషయాలు చెప్పుకొచ్చారు. అవి ఏంటంటే... చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించిహైదరాబాదును సైబరాబాద్‌గా మార్చి, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారు. HITEC City, Cyber Towers, Genome Valley, Outer Ring Road వంటి ప్రాజెక్టులు ఆయన విజన్‌ ఫలితం. Microsoft, Infosys, Wipro, Google వంటి దిగ్గజ కంపెనీలను ఆహ్వానించి యువతకు వేలాది ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజా భాగస్వామ్య అభివృద్ధి ప్రారంభించారు. ఇంకుడు గుంటలు ,వర్షాజల సేకరణ, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశపెట్టి నీటి యాజమాన్యంలో కొత్త దారులు చూపారు. రైతులకు రైతు బజార్‌లు, e-Seva సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతికతతో ముడివేశారు. పరిపాలనలో పారదర్శకత సాంకేతికతకు నాంది పలికారు. e-Governance, రియల్ టైమ్ గవర్నెన్స్, CM డాష్‌బోర్డ్ వంటి వ్యవస్థల ద్వారా ప్రతి శాఖపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. అధికారుల పనితీరుకు బాధ్యతను నిర్ధారించే విధానాలు అమలు చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విశేష ప్రగతి సాధించారు. హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రణాళిక ఆయన కాలంలోనే ప్రారంభమైంది. అమరావతి రాజధాని నగర రూపకల్పనకు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు ప్రతి జిల్లాలో విస్తరించారు. విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, APSSDC ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ అందించారు. ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లెర్నింగ్ పద్ధతులు ప్రవేశపెట్టారు. పెట్టుబడులు ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ను ముందు వరుసలో నిలిపారు. CII Partnership Summits ద్వారా దేశ, విదేశ పెట్టుబడులను తీసుకొచ్చారు. Kia Motors, Amaravati Start-up Zone, Google Fiber Project వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. Vision 2020 ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ, సాంకేతిక రంగాలలో దీర్ఘకాల ప్రణాళికను రూపొందించారు. ప్రజా సేవలకు ఆకస్మిక తనికీలు, ప్రజల వద్దకు పాలన, మీ సేవ వంటి పారదర్శక వ్యవస్థలను ప్రవేశపెట్టారు. లంచం రహిత పరిపాలనకు మార్గం సుగమం చేశారు. జాతీయ స్థాయిలో అనేక సార్లు ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ప్రపంచ ఆర్థిక వేదిక Davos కు ఆహ్వానించబడిన తొలి భారతీయ ముఖ్యమంత్రి కావడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. నారా చంద్రబాబు గారి నాటి స్వప్నం విజన్ 2020 నిజమైంది, నేడు విజన్ 2047 కి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
View More
Latest News
10 Oct 2025 21:56 PM
1
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
SP Vidyasagar Naidu: సరైన పద్ధతి కాదు.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ సీరియస్..
మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు.
View More
Latest News
10 Oct 2025 21:26 PM
1
1
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి కోటి రూపాయలు కాజేసిన దుండగులు
హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలోని బ్రిలియంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భారీ దొంగతనం జరిగింది. కాలేజీ నుంచి దుండగులు రూ.కోటికి పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి, నిందితుల కోసం చర్యలు చేపట్టారు. చోరీకి కారణాలు, నిందితుల కదలికలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
View More
Latest News
10 Oct 2025 21:23 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కల్తీ లిక్కర్ దందా: గులాం రసూల్
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గులాం రసూల్ మాట్లాడుతూ — పుట్టిన పరిశ్రమల్లో కల్తీ లిక్కర్ తయారు చేసి, ఒక్కో ఏరియాకు ఒక్కో నేతను ఎంపిక చేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారు. తంబళ్లపల్లె వద్ద మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీ లిక్కర్ దందా మంత్రి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని స్పీకర్ తన అనుచరులకు అప్పగించి లిక్కర్ దందాను అధికారికంగా నడిపిస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల బెల్ట్ షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ పంపిణీ చేసి వచ్చిన ఆదాయాన్ని మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి నివాసమైన కరకట్ట ప్యాలెస్‌కు తరలిస్తున్నారు అని గులాం రసూల్ తెలిపారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ షాపులను తొలగించగా, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులను తిరిగి ప్రవేశపెట్టి వాటి సంఖ్యను 70 వేలకు పెంచారు. అంతేకాకుండా వాటికి పోలీసు రక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను మద్యం వైపు నెడుతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిర్మించిన కల్తీ మద్యం సామ్రాజ్యం రాష్ట్రమంతా విస్తరించింది. ఈ కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న తంబళ్లపల్లెలో జరిగిన ఘటనలో నలుగురు మృతిచెందారు. అక్కడ కల్తీ మద్యం గుట్టురట్టై టిడిపి నాయకుల పాత్ర బహిర్గతమైంది. అయినా పద్ధతి మార్చుకోకుండా టిడిపి నాయకులు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. తమకు అనుకూలమైన వారికి టెండర్లు ఇచ్చి, వారితో మద్యం షాపులు నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఈ ప్రభుత్వం కేవలం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడానికే మద్యం విధానాన్ని అమలు చేస్తోంది. ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ లేకుండా ‘మా దేవుడు నిండితే చాలన్నట్లు’ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని గులాం రసూల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ జేబులు నింపుకోవడానికి ఎంతటి నీచ స్థాయికైనా దిగజారిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడటం సిగ్గుమాలిన చర్య. కల్తీ లిక్కర్‌తో ప్రజలను దోచుకున్న వారంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు అందరినీ దోషులుగా నిలబెట్టడం ఖాయమని” గులాం రసూల్ హెచ్చరించారు.
View More
08 Oct 2025 21:52 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఈరోజు వాల్మీకీమహర్షి జయంతిని, దరిశిలోని స్థానిక పొదలిరోడ్డులోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.ముందుగా ఈ కార్యక్రమంలో వాల్మీకీ మహర్షికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు ,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి,ఉపాధ్యాయులు ఉప్పుటూరి సురేష్ బాబు, మీనిగ శ్రీనివాసులు, ఎన్వీ.బాలసుబ్రమణ్యం,హాస్టల్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.
View More
Latest News
07 Oct 2025 19:28 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
డీజే లకు అనుమతి తప్పనిసరి: దర్శి సీఐ వై రామారావు
దర్శి ముండ్లమూరు తాళ్లూరు మండలాల పరిధిలో ఫంక్షన్లకు తిరునాళ్లకు ఏదైనా ఇతర కార్యక్రమాలకు ఎవరైనా మైకు సిస్టం వాడే సమయంలో డీజే లకు అనుమతి లేదని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు చెప్పడం జరిగింది. డీజే లను అధిక సంఖ్యలో వాడటం వల్ల ఆ శబ్దాలకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు కూడా చనిపోవడం జరుగుతోంది. కావున ఎవరైనా ఎలాంటి ఫంక్షన్లు, ఉత్సవాలు తిరునాళ్లు అలాగే మీటింగులు జరుపుకోవాలని ఉంటారో వారు ఖచ్చితంగా స్థానిక ఎస్సై ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి పర్మిషన్ అప్లై చేసుకోవాలి. పర్మిషన్ పొందిన వారు మైకు లేదా ఏదైనా సౌండ్ బాక్స్ లు పరిమిత సంఖ్యలో మాత్రమే వాడుతూ సౌండ్ మించకుండా ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన ట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు తెలియజేశారు.
View More
Latest News
07 Oct 2025 19:15 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ముండ్లమూరు లో రెచ్చిపోయిన దొంగలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో శుక్రవారం దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని లేని సమయాన్ని చూసి ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో పోలీసులు విచారణలో వెల్లడిస్తామని తెలిపారు.
View More
Crime News
04 Oct 2025 06:23 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ముస్లిం ల మీద కక్ష్య సాధింపు తగదు: షమ్షీర్
కన్పూర్లో మొన్న జరిగిన మిలాదున్నబి సందర్భంగా ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లు వేసినందుకు పోలీసులు పోస్టర్ వేసిన వాళ్ళను తీసుకువెళ్లి అరెస్ట్ చేయటం జరిగింది . ముస్లిం అనే ప్రతిఒక్కరు మా ప్రవక్త అయినా ముహమ్మద్ గారిని మేము అమితంగా ప్రేమిస్తాం . కేవలం ముస్లీమ్స్ మీద కక్ష సాధింంపు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తీవ్రంగా బాధ పడే రోజులు దెగ్గర్లోనే ఉన్నాయి . ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ చైర్మన్ గా దీనిని నేను కండిస్తున్నాను. వారి వారి మతాలను కులాలను గౌరవించు కొని ప్రేమించుకునే హాక్కు అందరికి మన రాజ్యాంగం మనకు కలిపించింది . ఐ లవ్ యూ ముహమ్మద్ అనటంలో ఎం తప్పుందో .అది ఏమైనా నేరమా మీ అంతరాత్మలను పర్సిలించుకోండి . ఐ లవ్ యూ ముహమ్మద్ .
View More
Local Updates
29 Sep 2025 07:38 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
వినుకొండ: సాయి డిగ్రీ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: గులాం రసూల్
వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ముస్లిం సమాజపు సంప్రదాయాలను అవమానపరిచేలా, అసభ్యత కలిగిన అంశాలను చేర్చడం తీవ్రంగా ఖండనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... స్థానిక జిన్నాటవర్‌ సెంటర్‌లోని గులాం రసూల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు విద్యార్థులకు జ్ఞానం, సంస్కారం, నైతిక విలువలు బోధించాల్సిన ప్రదేశాలు కాగా, ఆ ప్రాంగణాన్ని ఒక మత సమాజంపై దూషణకు వేదికగా మార్చడం అత్యంత బాధాకరమని ఆయన విమర్శించారు.. ఈ సందర్భంగా గులాం రసూల్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఒక్కసారి జరిగి ఆగిపోవడం లేదు. గతంలో గుంటూరు జిల్లాలోని భాష్యం విద్యాసంస్థల్లోనూ ముస్లిం సంప్రదాయాలపై అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ వినుకొండలోని సాయి డిగ్రీ కళాశాలలో అదే విధమైన ఘటన జరగడం ద్వారా యాజమాన్యం యొక్క నిజమైన ఉద్దేశ్యం బయటపడింది. ఇది విద్యార్థుల మధ్య సామాజిక వైరం రగిల్చే ప్రయత్నం, సమాజ శాంతిని భంగపరిచే చర్య్ఙ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యా సంస్థలో మతానికి వ్యతిరేకంగా ఈ విధమైన కార్యక్రమాలు ప్రోత్సహించడం కేవలం నిర్లజ్జకరమైన చర్య మాత్రమే కాకుండా, దేశ రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛ, మతపరమైన గౌరవానికి విరుద్ధమని గులాం రసూల్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో సమాజంలో విభేదాలు పెరిగి, యువతలో విషపూరిత ఆలోచనలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులు, ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చిన్నచూపు చూడకుండా వెంటనే జోక్యం చేసుకొని, కళాశాల యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వాతావరణాన్ని దెబ్బతీసేలా, మతానికి అవమానం కలిగించేలా ప్రవర్తించే వారికి శిక్ష తప్పదనే బోధ కలగాలంటే, సంబంధిత కళాశాలపై కేసు నమోదు చేసి, అవసరమైతే సంస్థ గుర్తింపును రద్దు చేసేంత కఠిన చర్యలు తీసుకోవాల్ఙి అని గులాం రసూల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు...
View More
Local Updates
28 Sep 2025 19:38 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రంలో బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరు: గులాం రసూల్
సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణను మించిన సైకో రాష్ట్రంలో మరొకరు లేరని ఆయనకు ఇప్పటికే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ ఫైర్ అయ్యారు. అసలు జనంలోకి వస్తే సైకోలా వ్యవహరించేదెవరో అందరికీ తెలుసని బాలకృష్ణ పై ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్ పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గులాబ్ రసూల్ మాట్లాడుతూ బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధ ఉన్నట్లు ఉంది అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ, లేకపోతే మరేదో ఉందని దానివల్లే నిండు అసెంబ్లీలో సైకో అనే పదం బాలకృష్ణ చెబుతున్నారని అసలు సైకో బాలకృష్ణ కే సరిపోతుందని అన్నారు. బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆ కేసు నుండి బయటపడిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు . నందమూరి బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని ఆయన వెంటనే ఆసుపత్రిలో చూపించుకోవడం మంచిదని అన్నారు. వైయస్ జగన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిజమైన నాయకుడిగా ఉన్నారని బాలకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని గులాం రసూల్ హెచ్చరించారు.
View More
Local Updates
26 Sep 2025 10:43 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భేటీ
నూతనంగా కలెక్టర్ గా నియమితులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గురువారం తాళ్లూరు ఎంపీపీ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు ని పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ తో కొద్దిసేపు చర్చించారు.... ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ తో చర్చించారు.. దర్శి లో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన సందర్బంగా డా|| గొట్టిపాటి లక్ష్మీ దర్శి పట్టణంలో వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల సమస్య CM కి తెలియజేయగా... వాటర్ స్కీం ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి మూడున్నర కోట్ల నిధులు మంజూరైనట్లు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ కి తెలిపారు. దీనిపై డాక్టర్ లక్ష్మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి, కలెక్టర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. దర్శి పట్టణంలో ఫిల్టర్ బెడ్లను నిర్మాణం పూర్తి చేస్తే తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. అదేవిధంగా గ్రామాలకు తాగునీరు వెళ్లే ఫిల్టర్ బెడ్ రూమ్ కూడా త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్ కి డాక్టర్ లక్ష్మి విన్నవించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చివరిదిశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తూర్పు వీరాయపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టాల పంపిణీ, రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కాలేజీ నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాల పై కలెక్టర్ గారితో గారితో చర్చించారు. దర్శి లో యోగ డే సందర్బంగా అధ్యాపకులు, విద్యార్థుల కోరికమేరకు దర్శి ప్రభుత్వ హై స్కూల్ - జూనియర్ కళాశాల లో ఫ్లోరిగ్ సమస్య ని కలెక్టర్ తెలియజేయగ త్వరలో సమస్యను పరిషరించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించుట, • గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో కొండ వైపు రోడ్డు పాడైందని వెంటనే తిరిగి నిర్మించాలని డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ ను కోరగా హైవే అధికారుల తో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. • అదేవిధంగా రైతులు పంట సాగు కోసం తూముల వద్ద పైపులు పూడి పోయాయని డా|| లక్ష్మీ కోరగా వెంటనే వాటిని కూడా పునర్నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. • ఎస్సీ కాలనీలకు రోడ్ల నిర్మాణం, తదితర సమస్యల గురించి కలెక్టర్ తో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు మేడం వెంకటేశ్వర్ రెడ్డి మరియు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
View More
Local Updates
25 Sep 2025 15:28 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం: నేరాల నివారణకు పహారా, FINS సిస్టమ్ తో పటిష్ట నిఘా
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా కఠిన పహారా నిర్వహిస్తున్నారు. Fingerprint Identification Networking System (FINS) ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై విచారణ చేసి వారి వివరాలను FINS సిస్టమ్‌లో ధృవీకరిస్తున్నారు. ప్రతి పట్టణం, గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలు, హాట్‌స్పాట్‌లలో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. క్రైమ్ కంట్రోల్‌లో ఆధునిక టెక్నాలజీని వాడుతూ ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. పోలీసుల క్రమమైన పర్యవేక్షణ వల్ల నేరగాళ్లకు తావులేకుండా నిరంతర భద్రతా వాతావరణం ఏర్పడుతోంది. ప్రకాశం పోలీసుల హెచ్చరిక: నేరాలకు పాల్పడే వారిపై ఎటువంటి కనికరము ఉండదు. కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజలకు విజ్ఞప్తి: సమాజ శాంతి భద్రత కోసం పోలీసులకు సహకరించండి. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసిందిగా తెలియచేశారు.
View More
Local Updates
25 Sep 2025 15:03 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి:
ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని పరిమళ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో దర్శి మండల పరిధిలోని అంగన్ వాడి సూపర్ వైజర్ లు అంగన్ వాడి కార్యకర్తలతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రస్తుతం వర్షాలకు సంభవించే అంటూ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ వేడిచేసిన మంచినీళ్లు త్రాగాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబల కుండా ఆరోగ్యశాఖ వారు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని ఆశ వర్కర్లకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ లు ఆర్. ఆనందలత, రమాదేవి, మండలంలోని అందరూఅంగన్ వాడి కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
View More
Local Updates
25 Sep 2025 14:46 PM
2
1
Newsread Image

No.1 Short News

Newsread
Darsi: దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఈరోజు దర్శి లో బీజేపీ పార్టీ ఆఫీసు నందు జనసంఘ వ్యవస్థాపకులు పూజ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 110 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలని అంతోదయ ప్రేరణలో భారత సమగ్ర అభివృద్ధికైకృషిచేసిన స్ఫూర్తిదాత ఏకాత్మే మానవత వాదంగా ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించిన ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షుడు వల్లభ వరపు అమరేశ్వర రావు, మాడపాకుల నారాయణమ్మ , వెంకటసుబ్బయ్య, అచ్యుత గురువర్ధన్ రావు, అనిల్ పాల్గొన్నారు
View More
Latest News
25 Sep 2025 14:37 PM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
ఎరువుల దుకాణాలపై తనిఖీలు – యూరియా నిల్వలు గుర్తించిన ప్రకాశం పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో యూరియా నిల్వలు గుర్తించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల రక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం పోలీసులు తెలిపారు.
View More
Latest News
24 Sep 2025 08:28 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్ల వల
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఇద్దరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షల 40 వేలు పోగొట్టుకున్నారు. తాళ్లూరు కు చెందిన ఒక వ్యాపారికి ఫోన్ చేసి తాము పోలీసులమని చెప్పి 75000 ఫోన్ పే చేస్తే వెంటనే నగదు అందజేస్తామని నమ్మించాడు. దీంతో ఆ వ్యాపారి సైబర్ నేరగాడు తెలిపిన ఫోన్ నెంబర్కు 75000 పంపించాడు. ఇదే రీతిలో కొత్తపాలెం కి చెందిన మరో వ్యాపారికి కాల్ చేసి 65000 బ్లాక్ చేశారు తర్వాత నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు, స్పందించిన పోలీస్ సిబ్బంది కొల్లగొట్టిన నగదును సైబర్ నేరగాళ్లు డ్రా చేసేందుకు వీల్లేకుండా బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించి విచారణ చేపడుతున్నారు.
View More
Crime News
24 Sep 2025 07:18 AM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
సోషల్ మీడియాలో లేనిపోనివి ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: ప్రకాశం ఎస్పీ
ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ వంటివి వాడుకొని అసభ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పోలీసులు తీవ్ర దృష్టి సారించారని తెలిపారు. మహిళలపై, ఇతరులపై కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, కులం-మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం లాంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా వేదికలపై పోలీస్ శాఖ నిరంతర నిఘా పెట్టి వ్యవహరిస్తోందని ఎస్పీ గారు తెలిపారు. సమాజాన్ని కలవరపెట్టేలా కాకుండా, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. యువత సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
View More
Local Updates
24 Sep 2025 07:02 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
Oyo: డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్య సక్సెస్ సీక్రెట్
ఓయో రూమ్స్... డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వెనకున్న ఒకే ఒక సక్సెస్ సీక్రెట్. ఓయో (OYO)... ఈ బోర్డు చూస్తే మీ మనసులో ఏమనుకుంటున్నారో పెద్దగా ఆలోచించకుండానే చెప్పొచ్చు. అవన్నీ పక్కన పెడితే అసలు ఓయో గురించి మీకు ఏమి తెలుసు? పేరు చూసి ఉబెర్ లా ఇదేదో విదేశీ కంపెనీ అనుకుంటున్నారు కదా? కానీ కాదు ఒక ఇండియన్ కంపెనీ. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా ఇది మొదలుపెట్టిన వాడు ఒక 19 ఏళ్ళ కుర్రోడు. ఇప్పుడు ఓయో వ్యాపార సామ్రాజ్యం విలువెంతో తెలుసా 60000 కోట్లకు పైమాటే. ఈ స్టోరీ చదివితే మీకు మరిన్ని ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి... రితేష్ అగర్వాల్...ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు. సొంతూరు ఒడిస్సా రాష్ట్రంలో రాయగఢ్. ఇతనేమీ పెద్దగా చదువుకో లేదు. సరిగా చెప్పాలంటే డిగ్రీ కూడా పూర్తిచేయలేదు. పోనీ బ్యాక్ గ్రౌండ్ గట్టిదేమో అనుకుంటే నాన్న ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు. ఇతను 13 ఏళ్ళ వయసులోనే కుటుంబానికి సహాయపడటానికి సిమ్ కార్డులు అమ్మేవాడు. మెల్లగా డిగ్రీ వరకు గెంటుకొచ్చినా ఈ చదువు కొనసాగించేలేక బిజినెస్ మీద దృష్టి సారించాడు. తను పని మీద ఒక రోజు రాత్రి హోటల్ లో స్టే చెయ్యాల్సి వచ్చినప్పుడు ఎదుర్కున్న పరిస్థితులే అతనికి ఈ వ్యాపారం లో అడుగుపెట్టేలా ప్రేరేపించాయి. దాంతో అతను ముందుగా oravel stays అనే ఒక బుకింగ్ వెబ్ సైట్ ను మొదలుపెట్టాడు. అందులో అందుబాటు ధరల్లో ఉండే హోటళ్ల లిస్ట్ ఉండేది. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి డబ్బు లేకపోవడం తో ఇబ్బందిపడేవాడు. అదే సమయంలో కొత్తగా స్టార్ట్ అప్ లను పెట్టి వ్యాపారవేత్తలు కావాలనుకునే వారికోసం Pay Pal ఓనర్ ఇచ్చే లక్ష డాలర్ల Theil Fellowship గెలుచుకుని ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని వృద్ధి చేసాడు. అలా 2013 లో మొదలయ్యింది ఓయో ప్రస్థానం. మొదటగా ఇక్కడ బడ్జెట్ హోటల్ లలో ఉండే సమస్యలు అర్థం చేసుకున్నాడు రితేష్. తక్కువ కాస్ట్ హోటల్స్ లో ఉండే అతిపెద్ద సమస్య శుభ్రత లేకపోవడం. సో దానిమీద దృష్టిపెట్టాడు. మొదట్లో తనవద్ద లిస్టయిన హోటల్స్ తో రెవిన్యూ షేరింగ్ పార్టనర్ షిప్ తీసుకునేవాడు రితేష్. వాటిల్లో కావాల్సిన మార్పులు చేసేవాడు. వాటర్, నీట్నెస్, ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడం లాంటి సౌకర్యాలతో పాటు ఈజీ గా బుక్ చేసుకునే అవకాశం కలిపించాడు. లోకల్ ఐడెంటిటీ కార్డులతో ఎవరైనా జంటలు ఈజీ గా రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కలిపించాడు. దాంతో ఓయో సక్సెస్ మొదలయ్యింది. ఓయో లో లిస్టయిన హోటల్స్ కి రెవిన్యూ, బుకింగ్స్ పెరగటంతో ఓయో తో పార్టనర్షిప్ కోసం మరిన్ని హోటల్స్ ముందుకొచ్చాయి. దాంతో కంపెనీ 2015 నాటికి దూసుకుపోయింది. అప్పుడు ఈ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు నుంచి ఫండింగ్ తీసుకుని వరల్డ్ మార్కెట్ మీద కన్నేశాడు రితేష్. ఎప్పటికప్పుడు తన వ్యాపార స్ట్రాటజీ ని మార్చుకుంటూ దూసుకెళ్లాడు. బుకింగ్స్ తో సంబంధం లేకుండా నిమం గ్యారంటీ ఇన్కమ్ వంటి కొత్త కొత్త పధకాలు పెట్టి పార్టనర్స్ ను పెంచుకున్నాడు. 2018 నుండి సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేట్ స్టే లపై దృష్టిపెట్టింది. ఇప్పుడు ఓయో రూమ్స్ ప్రపంచం లో దాదాపు 80 కంటే ఎక్కువ దేశాల్లో పాతుకుపోయింది. 40 వేల హోటల్స్ 17 వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులు కూడా పెరిగారు. ఈలోగా కోవిడ్ రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. దాంతో వ్యాపారం పూర్తిగా దెబ్బ తినిపోయింది. మరోవైపు IPO కు వచ్చినా సెబీ ఎంక్వయిరీ కి ఆదేశించడం వంటి కారణాలతో IPO నుండి వెనక్కు తగ్గింది. కంపెనీ పనైపోయిందనుకున్నారందరూ. మరో బైజూస్ లా ఓయో కూడా మునిగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో లాభాలు ఇవ్వని హోటల్స్ ను వదిలించుకుని. మళ్ళీ రెవిన్యూ షేరింగ్ లో కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. ఎందుకు ఓయో ఇంత సక్సెస్ అయిందంటే: దీనివెనుకున్న మాస్టర్ మైండ్ ఓన్లీ రితేష్ అగర్వాల్. ఎప్పటికప్పుడు మార్కెట్ అర్థం చేసుకుంటూ ముందుకు సాగటమే అతని సక్సెస్ సీక్రెట్. ఒకప్పుడు హోటల్స్ లో జంటలు స్టే చేస్తే రైడింగ్ లాంటి ఇబ్బందులు ఉండేవి. దాంతో అందరికి భయం ఉండేది. అయితే ఓయో రూమ్స్ లో అటువంటి ఇబ్బందులు ఉండకపోవడంతో కపుల్స్ కు ఓయో రూమ్స్ స్వర్గంలా మారాయి. దాంతో వారు ఎక్కువగా రావడంతో ఓయో మీద కేవలం పెళ్లికాని యువతకే అనే ముద్రపడిపోయింది. కానీ ఇది నిజం కాదు. ఓయో రూమ్స్ ఎక్కువగా టెంపుల్స్ ఉండే ప్రాంతాల్లో బుకింగ్స్ ఎక్కువగా అవుతాయట. కేవలం జంటలకు ఇవ్వడమే ఓయో సక్సెస్ కు రీజన్ కాదు. ఎప్పటికప్పుడు బిజినెస్ స్ట్రాటజీ మార్చుకోవడం, గెస్టులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఇలా ప్రతీ విషయంలో ఉండే కేర్ ఈ రోజు ఓయో ను ఈ స్థాయి లో నిలబెట్టింది. మరోపక్క ఫ్యామిలీలను మరింతగా హోటల్స్ కు వచ్చేలా చెకిన్ పాలసీ నీ మార్చింది. పార్టనర్ హోటల్స్ ఓకే అయితేనే జంటలకు రూమ్ ఇవ్వొచ్చు అని కొత్త నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలు దేశంలో ఉన్న అన్ని హోటల్స్ కు వర్తించవు. సో ఇది ఒక డిగ్రీ కూడా చదవని ఒక కుర్రోడి విజయగాధ. ఇతని విజయం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కూడా ఆశ్చర్యపరిచింది. 2020 లో ఇండియా కు వచ్చినప్పుడు ( అప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కాదు) నీది చిన్న కంపెనీ కాదు రితేష్, గుడ్ జాబ్ అని పొగిడేలా చేసింది. వ్యాపారం చేయాలంటే డబ్బే కావాలనే ఆలోచన కంటే వ్యాపారం చెయ్యాలంటే కావలిసింది ఒక కొత్త ఆలోచన అనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన బిజినెస్ మెన్. సో వ్యాపారమే మీ టార్గెట్ అయితే ఈ సక్సెస్ స్టోరీ నుండి మీరు నేర్చుకొవలిసింది చాలా ఉంది కదా. ఏమంటారు? ఇంతకీ OYO అంటే ఏంటో తెలుసా On Your Own!
View More
Motivation
24 Sep 2025 06:43 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ: GHMC కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మీర్ హాదీ అలీ
రంగారెడ్డి జిల్లా ఈస్ట్ జోన్ జిహెచ్ఎంసి పరిధిలోని హయత్ నగర్ లో గల సత్యనారాయణ కాలనీ లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని 1, 2, 4, 5 రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానం గా తయారయ్యాయని ఈ ప్రాంతంలో దర్గా, మస్జిద్ లకు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు ఈ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారని త్వరగా రోడ్లు నిర్మాణం చేపట్టాలని ఆయన జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటివ్ కు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీర్ హాదీ అలీ వినతిపత్రం అందజేశారు, త్వరలోనే రోడ్ల నిర్మాణానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసాని ఇచ్చారు.
View More
Local Updates
24 Sep 2025 06:26 AM
1
1
Newsread Image

No.1 Short News

Newsread
టిడిపి సీనియర్ నాయకులు శాగం కొండారెడ్డిని పరామర్శించిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
తాళ్లలూరు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు శాగం కొండారెడ్డి అనారోగ్య కారణంగా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం వెలుగువారిపాలెం గ్రామం లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, కార్యకర్తలు, అభిమానలు ఉన్నారు.
View More
11 Sep 2025 13:51 PM
1
1
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పోతాంగల్ : దహన సంస్కారాల నిమిత్తం సేవా దృక్పథం తో ఆర్థిక సహాయం..
పోతాంగల్ గ్రామం లో కొంతల నాగయ్య అనే వ్యక్తి మరణించడం తో అంత్యక్రియలకు తగిన ఆర్థిక సహాయం కొరకు గంట్ల రాజు అనే యువకుడు సామాజిక సేవకుడు డాక్టర్ సీతాలే రమేష్ గారికి సహాయం కోరగా, 13,500/- రూపాయలు డబ్బులు విరాళంగా సేకరించి కొంతల నాగయ్య అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు సితాలే రమేష్ తొ పాటుగా మేకల పీరజి,మేధారి దశరథ్ ,మంగలి విశ్వనాథ్, గంట్ల రాజు,B సాయిలు,k.నాగేషం,వీరయ్య, కొంతల పిరాజీ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.
View More
Latest News
11 Sep 2025 13:40 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
జ్వరాల నేపథ్యంలో దర్శి ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జ్వరాలు అధికంగా ఉన్న సీజన్లలో రోగులకు అందుతున్న సేవలపై దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టి సారించి గురువారం ఉదయం ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు.ఆస్పత్రిలో వైద్య సేవలపై డాక్టర్ లక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో CI రామారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు తదితరులు ఉన్నారు.
View More
Latest News
11 Sep 2025 13:20 PM
0
1
Refresh Page
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (793)
  • Motivation (11)
  • Crime News (25)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (217)
  • Sports News (12)
  • Education (12)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.