పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి.. కీలక కేసులో విచారణ..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు.
కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కింతాడ కళావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్ 13న శ్రీ రెడ్డిపై కేసు సమోదు చేశారు. సోషల్ మీడియా X, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి శ్రీ రెడ్డి ఖాతాల్లో పోస్టుల ఆధారాలు సేకరించి పోలీసులకు ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు శ్రీ రెడ్డిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ శ్రీ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు శ్రీ రెడ్డి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించవద్దని, విచారణ జరిపి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి 41ఏ నోటీసులు ఇవ్వాలని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఆదేశించింది హైకోర్టు. అంతే కాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి కూడా సూచించింది.
అలా హైకోర్టు ఆదేశాలతో శ్రీరెడ్డి పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. పలు కీలక అంశాలపై సిఐ రామకృష్ణ శ్రీ రెడ్డిని విచారించారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి పెట్టిన పోస్టులు చూపించి ఇవి మీరు పెట్టినవేనా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనే అనేక రకాల ప్రశ్నలతో విచారణ జరిపారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే విచారణకు అవసరమైనప్పుడు మళ్లీ రావాలని, అందుబాటులో ఉండాలని చెప్పారు.
రాయచోటి: యాక్సిడెంట్ లో ఒకరి మృతి, మరొకరికి గాయాలు
మదనపల్లె నుండి రాయచోటికి ఓమిని వ్యాన్ లో వస్తున్న లక్కిరెడ్డిపల్లి మండలం అప్పకొండయ్యగారి పల్లెకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆరిఫ్ తన వాహనము చెట్టు కు ఢీకొనడంతో ఆరిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా వ్యాన్లో ఉన్న ముజాహిద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుండి బెంగళూరుకు తరలించినట్లు అక్కడ వైద్యులు తెలిపినట్లు స్థానికులు తెలియజేశారు.
బెంగళూరు మగడ రోడ్ లో ఓ యువకుడు రోడ్ మద్యలో కుర్చీ వేసుకొని టీ త్రాగుతూ రీల్ చేసేడు ఆది సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయ్యింది, పోలీసులకు మండింది ,ట్రాక్ చేసి తీసుకొని పోయి కేసు పెట్టీ బొక్కలోకి తోసేరు,చేతిలో మొబైల్ లాక్కొన్నారు మళ్ళీ ఎక్కడ రీల్ చేస్తాడో అని. హాట్స్ ఆఫ్ టు పోలీస్ .
బాపట్లలో బాప్టిజం స్వీకరిస్తూ నదిలో మునిగి ఇద్దరి మృతి
బాపట్ల జిల్లా పెనుమూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలోని కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటున్న సమయంలో పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్‌బాబు, పెనుమాల హర్షవర్థన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నదిలో దూకి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు (19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చేపట్టగా కాసేపటి తర్వాత వారి మృతదేహాలు లభించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్ధిక సంఘ బృందం ఈరోజు తిరుపతి లో పర్యటించారు ఈ సందర్బంగా తిరుపతి లో నిర్వహించిన అర్బన్ లోకల్ బాడీస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ షేక్ సజీల గుంటూరు నగర అభివృద్ధి గురించి,అభివృద్ధి కి అవసరమైన ఫండ్స్ గురించి సమావేశంలో ప్రసంగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా,సెక్రటరీ రిత్విక్ రాజానమ్ పాండేIAS ,ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ IAS , అడిషనల్ డైరెక్టర్ చల్లా అనురాధ , జాయిన్ డైరెక్టర్ గోపాలకృష్ణరెడ్డి, EE సుందర్ రామి రెడ్డి, వివిధ కార్పొరేషన్లు మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం వెలుగువారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మోడల్ ప్రాథమిక పాఠశాల, ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల లో 2025 - 26 విద్యా సంవత్సరంలో విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొనుటకు ఎస్సీ కాలనీలో, గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు , విద్యార్థులు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు
ఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కువ అవ్వడంతో తాళ్లూరు పోలీసులు ఇద్దరు వ్యక్తుల ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ గ్రామాలలో నివాసాల వద్దకు వచ్చి తాము అనాధ ఆశ్రమం నుండి వచ్చామని తగిన సహాయం చేయాలని ఒక మహిళ అడుగుతు పూర్తిగా తాళాలు వేసి ఉన్న నివాసాలను గమనించి మరోక వ్యక్తికి నమాచారం ఇస్తుందని ఆ వ్యక్తి వచ్చి పూర్తిగా ఆ పరినరాలు గమనించి తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇటువంటి వారి నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండడం కోసం తాము ఈ ఫోటోలను విడుదల చేశామని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హజ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన హాజీ షేక్ హసన్ బాషా గారు ఈరోజు సాయంత్రం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షిబ్లి స్వాగతాన్ని పలుకుతూ ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయల హజ్ సబ్సిడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్క హాజీకి అందించే విధంగా ప్రభుత్వం చేరువ తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే హజ్ యాత్ర అనేది పూర్తి ముస్లిం సాంప్రదాయానికి మరియు ఇస్లాం విధానం నందు ఒక భాగం ఇటువంటి కమిటీలో ఒక్క ముస్లిం మత పెద్ద కూడా లేకపోవడం బాధాకరం, కాబట్టి మిగిలిన ముగ్గురు సభ్యులను ముస్లిం మత పెద్దలను ఇందులో నియమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు & MHPS ఉలేమా వింగ్ మౌలానా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రెహమాన్, ముఫ్తీ యూనస్, మౌలానా అబుల్ సత్తార్ ఖాన్ అలాగే MHPS విజయవాడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పచ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు . ఈ దాడులను బీర్కూర్ మండల సీనియర్ బీజేపీ నాయకులు బిరుగొండ ఖండిస్తున్నట్లు పత్రిక ప్రకటన లో తెలిపారు , హిందువులపై జరుపుతున్న దాడులు అమానవీయమని ఆయన తెలిపారు
అసంఘటిత కార్మికుల,ఉద్యోగుల కాంగ్రెస్ దర్శి నియోజకవర్గ సమన్వయ కర్త,కైపు వెంకటకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి ద్వారానే విజయం సాధించగలం, హింసను అహింసతోనే జయించగలం, ద్వేషాన్ని ప్రేమతోనే సాధించగలం అని చెప్పిన క్రీస్తు బోధనలే ఆదర్శమని, ప్రపంచానికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు సిలువ ఎక్కిన రోజే గుడ్ ఫ్రైడే అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు
జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో దర్శి నియోజకవర్గం నాయకులు 2 ఉపాధ్యక్షులు, 1 ప్రధాన కార్యదర్శుల,1 కార్యదర్శి తో నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఆమోదించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి, లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉపాధ్యక్షులుగా గోరంట్ల కోటేశ్వరరావు దర్శి మండలం,మిట్ట సంజీవరెడ్డి దొనకొండ మండలం,ప్రధాన కార్యదర్శి కాటం వెంకటరమణారెడ్డి కుర్చేడు మండలం,కార్యదర్శి కొప్పుల సాయి తాళ్ళూరు మండలం,
వేసవికాలం దృష్ట్యా పశువులకు దాహం తీర్చేనీటితొట్టెల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం ప్రకాశం భవనంలో డ్వామా అధికారులతోనూ, ఎంపీడీవోలతోనూ ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మంజూరు అయిన నీటితొట్టెల నిర్మాణాలను ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోను
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,ఆర్.డబ్ల్యు.ఎస్.అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా అవసరం లేని చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు తన దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్య ఉందని ప్రజలు కాల్ సెంటరుకుగానీ, అధికారులకుకానీ ఫోన్ చేస్తే వారితో దురుసుగా ప్రవర్తించినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలోనూ,ప్రజల వద్ద ఉన్న ఈ-వ్యర్థాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామములో గుంటి గంగమ్మ తిరునాళ్ళ సంధర్భంగా కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభను చూసి దాదాపు 15 సంవత్సరాలు అవుతుండగా కైపు వెంకటకృష్ణారెడ్డి సామాన్యుడే కానీ అసాధ్యుడని పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా స్పందించారు. ఒక సామాన్యుడు రాజకీయాలకు వస్తే బడ బడా రాజకీయ నాయకులు సహించలేకపోతున్నారని ఆయన అన్నారు.
మార్కాపురంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
మార్కాపురం పట్టణం నందు మొత్తం 28 ప్రదేశాలలో ప్రకాశం జిల్లాకు చెందిన 155 మంది పోలీసు అధికారులు మరియు 600 సిబ్బందితో కలసి, ప్రత్యేక పోలీస్ బలగాలు స్పెషల్ పార్టీ, స్వాట్ టీం, 30 డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. పాత నేరస్తుల ఇళ్లలలో, చెడు నడతకలిగిన వారు, గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ యాప్స్, కిరాణా షాప్ లలో, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మోటార్ సైకిళ్లు, సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేటు సరిగా లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు. వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు. లాడ్జీలను, డార్మోట్స్ తనిఖీ చేసి,కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
తిరుపతి లో జరుగుతున్న 16 వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం లో నారపుశెట్టి పిచ్చయ్య
తిరుపతి లో జరుగుతున్న 16 వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీల ప్రధాన కార్యదర్శి సురేష్ సురేష్ కుమార్ గారితో సమావేశం లో దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య. ఈ సమావేశంలో హాజరైన 15 మున్సిపల్ చైర్మన్లలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు హాజరుఅయ్యారు.
బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ స్థాయి సమావేశం
బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ స్థాయి సమావేశంలో 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతనంగా చేర్చుకోపోయే విద్యార్థుల గురించి , డ్రాప్ అవుట్ విద్యార్థుల గురించి గురువారం చర్చిస్తున్న తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ సార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీంసార్ సమావేశంలో ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగనవాడి టీచర్స్, CRP మారుతి, గ్రామ సచివాలయ మహిళా పోలీస్ , ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.
తాళ్లూరు లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో క్లస్టర్ స్థాయి సమావేశం
గౌరవ Collectot గారూ మరియు Deo గారు ఆదేశాల మేరకు VK ప్రభుత్వ ఉన్నత పాఠశాల తాళ్లూరు లోక్లస్టర్ స్థాయి సమావేశంలో 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతనంగా చేర్చుకోపోయే విద్యార్థుల గురించి , డ్రాప్ అవుట్ విద్యార్థుల గురించి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి G. సుబ్బయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు S శేషగిరి రావు, ప్రాథమిక, ప్రాథమికో న్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగనవాడి టీచర్స్, గ్రామ సచివాలయ పోలీస్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ మరియు CRP శాంతికుమారి పాల్గొన్నారు.
మూగజీవాలకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయనున్న పంచాయితీ రాజ్ శాఖ
AP : వేసవికాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉండటంతో మూగ జీవాలు నీటి కొరకు ఇబ్బంది పడుతున్నాయని తెలిసి,దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించింది.మూగజీవాల దాహం తీర్చేందుకు ఈ నెలాఖరుకు 15 వేల నీటి తొట్టెలను నిర్మాణం చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద 60 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభిస్తున్నామని,డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు,క్షేత్రస్థాయి సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు.
బీర్కూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి కి ఘన నివాళులు అర్పించడం జరిగింది , బీజేపీ సీనియర్ నాయకుడు బీరుగొండ పూలమాల వేసి ఘాన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో యోగేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ జాతర తిరునాళ్ల సోమవారం జరగనుంది. ఈ వేడుకలకు తాను హాజరు అవుతున్నట్లు సినీ నటి హెబ్బా పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
తూర్పు గంగవరం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ గుడిలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి టెంకాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కార్య క్రమంలో EX ఎంపీపీ పోశం సుధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
14 /4 /2025 అనగా ఈరోజు తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో శ్రీ గుంటి గంగమ్మ తిరుణాల అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే తిరునాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు సంసిద్ధం కాగా అలీషా వేసిన లైటింగ్ గుడికి మరింత అందాన్ని పెంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల తిరుమల చేరుకున్నారు. ఇక్కడి గాయత్రి సదనంలో టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నట్టు తెలియజేశారు.
భారతదేశ దిక్సూచి , నవభారత నిర్మాత , పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తాళ్లూరు మండల శాఖ గౌరవాధ్యక్షులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి , అధ్యక్షులు గండూరి నాగరాజు , ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు మరియు మండల కమిటీ.
రోడ్డు మీద పోలీసుల అతి డ్యూటీ తో - నిండు ప్రాణం లారీ కింద నుజ్జు నుజ్జు
హైదరాబాద్: IDPL DMart ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వెహికిల్స్ చెక్ చేస్తుంటే ముందు నుంచి వెళ్తున్నా 2 వీలర్ బైక్ ను హెల్మెట్ లేదు అని బైక్ ఆపడానికి ప్రయత్నించాడు అయితే బైక్ పైన అతను అతని వైఫ్ ఉన్నారు బైక్ అతను బైక్ ఆపకుండా వెళ్తున్నాడు అని, బైక్ అతన్ని ట్రాఫిక్ వారు బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేయగా ఆ బైక్ అతను పక్కన వెళ్తున్న బస్ కింద పడిపోయాడు ఆ బస్ అతన్ని కొద్ది దూరం అలాగే లాక్కొని పోయింది అయితే అతని భార్యకు ఏమి అవ్వలేదు కానీ భర్త మాత్రం నుజ్జు నుజ్జు అయ్యాడు,ప్రభుత్వాలు ఇచ్చే టార్గెట్ కోసం పోలీసులు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఫోటో సిస్టమ్ పెట్టారు కాబట్టి ఫోటో తీసి వదిలేస్తే అయిపోయ్యేది, ఇప్పుడు వీళ్ళ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది.
డా తాడివలస దేవరాజుకు కృతి ఫౌండేషన్ వారు అవార్డు అందజేశారు
కృతి ఫౌండేషన్ అధినేత శ్రీమతి అశ్విని ఆధ్వర్యంలో కృతి పౌండేషన్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ నందు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు . ముఖ్య అతిధులుగా టీడీపీ యువ నాయకులు మద్దలూరి అమర్నాథ్, జమ్మలమడక నాగ మణి,జేడీ డాక్టర్ బాబీ రాణి, చిన్న గంజాం యం.ర్ .ఓ జె.ప్రభాకర రావు, సి ఐ సూరేపల్లి సుబ్బా రావు , మెరైన్ సి ఐ సింగిరీసు సాంబ శివ రావు. డాక్టర్ అమృతపాణి ,గౌరవ అధ్యక్షులు ఆకురాతి వెంకట వరప్రసాద్ రావు పాల్గొన్నారు . వైద్య , సామాజిక , ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తాడివలస దేవరాజు కు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం జాతీయ సేవ రత్నా అవార్డు తో సత్కరించారు.
ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ ఐదు సంవత్సరాలుగా చేస్తున్న సేవలను కొనియాడి, చీరాలలో జరుగు సేవా కార్యక్రమాలకి కృతి ఫౌండేషన్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చీరాల లో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ సభ్యులు , ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల లోనే వివిధ సేవా రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకు అవార్డు అందచే,సి వారి సేవలను తెలియజేశారు
బోధన్ ఏక చెక్రేశ్వర ఆలయానికి కల్లూరు గ్రామం నుండి పశు గ్రాసం
11.04.2025..
బోధన్ ఏక చకేశ్వరా గోశాల కి ఈ రోజు కల్లూరు గ్రామం నుండి దాతలు బస్వంత్ పటేల్ గారు,
దుబాయ్ అంజన్న గారు,
మేటి హన్మాండ్లు గారు, మెత్రీ కిరణ్ గారు, గోమాత సేవలో 250 గడ్డి కట్టలు పశుగ్రాసం పంపడం జరిగింది.
సేవకులు ప్రసాద్ భిర్కూర్,సితలే రమేష్
మీరు పాలిటెక్నిక్ లో మంచి ర్యాంక్ సాధించాలి అనుకుంటున్నారాఅయితే మీకోసమే KOTALE PUBLICATIONS వారి బుక్ ద్వారా పాలిటెక్నిక్ లో మంచి ర్యాంక్ సాధించగలరు బుక్ కోసం వెంటనే కాల్ చేయండి ఫోన్ +9502871996
మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీర్కూర్ బిజెపి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్ నాయకులు హనుమాన్లు సాయిబాబా మేత్రి సాయిలు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
జై యూనియన్ కు వెన్ను దన్ను గా నిలుస్తా: దాడి సత్యనారాయణ
విశాఖ లో జై యూనియన్ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా జై యూనియన్ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలు రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి వివరించారు. అనంతరం దాడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం లో జై యూనియన్ ప్రసారాలు అద్భుతంగా ఉన్నాయని, వీరి శ్రమకు మద్దతు ఇస్తానని, ఏ సమయం లో నైనా జై యూనియన్ పక్షాన నిలబడి వారు ఎదుర్కుంటున్న సమస్యల పట్ల పోరాడతానని, వార్తలు చేరవేయడంబ్లో వీరు ఎంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని, వీరి సాధక బాధలను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. త్వరలోనే స్వయంగా చంద్రబాబు తో మాట్లాడి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ: జై యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో ప్రేక్షకులను అలరించిన చిన్నారి నృత్యం.
విశాఖ లో వైభవంగా నిర్వహించిన జర్నలిస్టుల సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో JBC ట్రైనింగ్ సెంటర్ ఆద్వర్యం లో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల ను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమ లో చిన్నారి నృత్యానికి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు.
విశాఖ లో రాష్ట్ర వ్యాప్త యూట్యూబ్ జర్నలిస్టుల సంఘం జై వార్షికోత్సవ వేడుకలు
రాష్ట్రవ్యాప్త యూట్యూబ్ జర్నలిస్టులతో వేడుక .. జై యూనియన్ కు వెన్ను దన్నుగా నిలుస్తా : దాడి సత్యనారాయణ
ముఖ్యఅతిథిగా విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ ... దాడి సత్యనారాయణ
వైభవంగా విశాఖలో జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యూట్యూబ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి వివరించిరు. జర్నలిస్టులు తెలిపిన పలు విషయాలు సావధానంగా ఆయన విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన జైయూనియన్ కు తొలుత హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుపరిపాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి సమర్థవంతమైన నాయకుల దృష్టికి జై యూనియన్ విలేకరుల సాధక బాధలు, కష్టనష్టాలు ప్రభుత్వానికి చేరవేయడంలో వారధిగా నిలవాలనే ఉద్దేశంతో నేడు ఈ సభకు విచ్చేశానన్నారు. ఎంతటి మహావృక్షమైన ఒక విత్తనంతోనే ప్రారంభమవుతుందని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పత్రికలు, చానలల్లో పనిచేసి, సమాజ సేవలో తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో జర్నలిజంపై పూర్తి అవగాహనతో ఏర్పడిన జై యూనియన్ కూడా ఒక విత్తనముగా నాటబడిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ యూనియన్ మహావృక్షంగా ఎదగాలంటే పరిపాలకుల అండదండలు ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో వార్తాపత్రికలు , టీవీ చానల్స్ కంటే మొబైల్ ద్వారా వార్తలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు దేనిని ఆదరిస్తున్నారో దానిని ప్రభుత్వము ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కావున జై యూనియన్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో తాను వెన్నుదన్నుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా యూట్యూబ్ జర్నలిస్టుల పక్షాన తాను ఎట్టి పోరాటానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు. వ్యయ, ప్రయాసలకు ఓర్చి వార్తలు చేరవేయడంలో ఎంతో శ్రమిస్తున్నారని కావున వీరి శ్రమను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రాబోవు ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ కు కూడా యూట్యూబ్ జర్నలిస్టులు వచ్చే ఎన్నికలలో మరింత ఘనవిజయం సాధించేందుకు ఉపయోగపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సభకు అధ్యక్షత వహించిన యువి రావ్ జై సంస్థ వ్యవస్థాపన, ఒక్క ఏడాదిలో జై యూనియన్ చేపట్టిన కార్యక్రమాలు వేదికపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాలకు విస్తరించటంతో వేడుకకు తరలివచ్చిన జిల్లా జై యూనియన్ అధ్యక్షులను జై రాష్ట్ర కార్యవర్గం జై యూనియన్ జ్ఞాపక, సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు,
జై యున్న రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు పెద్ద ఉయ్యాలవాడ గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి కేసులో శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడం జరిగింది ఇందులో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి టీ మా టీం డాక్టర్లు వచ్చారు మరియు ఇన్చార్జి తహసిల్దార్ గారు దర్శి ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర stock point (Vkghs,Tallur) verification చేస్తున్న Ongole deputy Educational officer A.Chandra mouliswar గారు and CMO Ruth గారు
గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా
కోనేరి, గుడి పరిసర ప్రాంతాలను బుధవారం శుభ్రం చేయడం జరిగింది. దేవదాయ శాఖ రికార్డ్ అసిస్టెంట్ ప్రసాద్, కార్యనిర్వాహన అధికారి రామయ్య మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
తాళ్లూరు మండలంలో రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాలు
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం సోమరపాడు పరిధిలోని శివరాంపురం వెళ్లే దారిలో ఎమ్మెస్ వెంచర్ నిర్మాణం భాగంలో ఉన్న ఇళ్ల నుండి సింగిల్ ఫేస్ జనరేటర్ ను దొంగలు అపహరించడం జరిగింది.అయితే ఇటీవల కాలంలో నాగం బొట్లపాలెం లోని నరసింహస్వామి ఆలయంలో కూడా దొంగలు చొరబడి విలువైన వస్తువులు నగదు అపహరించిన నా సంగతి అందరికీ తెలిసిందే.
ప్రకాశం జిల్లా లో 3D MAX డిజైన్ వచ్చిన మహిళలకు ఉద్యోగ అవకాశం
Apartments& building..Elevations and plans:
బిల్డింగ్ ఎలివేషన్ & ప్లాన్స్ గీయుటకు 3D MAX వచ్చిన డిప్లొమా లేదా B.TECH చదివిన ఫిమేల్ ఎంప్లాయ్ కావలెను. ఆకర్షణీయమైన శాలరీ కలదు.
వర్క్ ప్రదేశం: ఒంగోలు
కంపెనీ: బాషా ఆర్కిటెక్ట్స్
సెల్: 7702244786
సోమవరప్పాడు లో వానర మూకల స్వైరవిహారం భయాందోళనలో ప్రజలు
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం కు చెందిన సోమవరప్పాడు లో గత కొంతకాలంగా విపరీతంగా కోతులు సంచరిస్తూ ఇండ్లలోకి చొరబడుతున్నాయి. ఈ 8వ తేదీ అనగా మంగళవారం సోమవరప్పాడు లోని ముగ్గురు వ్యక్తులపై ఈ కోతులు దాడి చేయడం జరిగింది, మసీదు వీధిలోని రెండు సంవత్సరాల చిన్నారిపై కూడా ఇంటిలోకి చొరబడి పొట్టపై కొరకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడానికి వీధిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు, దీంతో అక్కడ ప్రజలు భయంతో ఆందోళన వ్యక్తం చేస్తు దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
పిడి డిఆర్ డిఏ ఆకస్మిక తనిఖీ
తాళ్లూరు మండలంలోని శివరాంపురంలో జరుగుతున్న ఎస్ హెచ్ జి యాక్షన్ ప్లాన్ 2025- 2026 వ సంవత్సరానికి సంఘ సభ్యుల అవసరాలు ఏమున్నాయి,ఎంత అవసరమో అనేదానిపై సర్వే చేయడం జరుగుతుంది సర్వేను గ్రామంలోని వివోఏ మరియు ఎన్యూమేరేటర్స్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి పిడి డిఆర్ డిఎ ,టి నారాయణ గారు తాళ్లూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్
కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్ధుల అదృశ్యం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటిన చీమకుర్తి క్రీడాకారులు
చీమకుర్తికి చెందిన కె. వంశీకృష్ణ, ఎం. త్రివిక్రమ్ ఆదివారం రాష్ట్రస్థాయి అండర్ 15 రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. రాజమండ్రిలో రెజ్లింగ్ శాంపియన్షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రెజ్లింగ్ కోచ్ ఉమామహేశ్వర రావు, తదితరులు అభినందించారు
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
శ్రీరామనవమి సందర్భంగా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కరిముల్లా, సైదా వలి, సాయి, జిలాని, కలసి మొదటగా రామాలయం ను సందర్శించి తదుపరి భైరవకోనకు చేరుకొని శివునికి కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ తనకు కులమత బేధాలు లేవని అందరూ సమానమేనని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ పూజలు నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.
MSR CNC వుడ్ వర్క్స్ వర్ని ,
మా వద్ద అన్ని రకాల వుడ్ వర్క్స్ చేయబడును , తలుపులు మంచి డిజైన్ లో కస్టమర్ కోరుకున్న రీతి లో చేసి ఇవ్వబడును , తలుపులు , కిటికీ లు అన్ని క్వాలిటీ డిజైన తో టేకు కలప తో చేసి ఇవ్వబడును
ప్రోపరేటర్ : మెక్కా సాయిలు , ఫోన్: 6303346125
అడ్రస్ : నిజామాబాద్ రోడ్ , వర్ని
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో ప్రతిభ చాటిన శ్రీ సరస్వతి స్కూల్ విద్యార్థులు
శ్రీ సరస్వతి హై స్కూల్ విద్యార్థులు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. టి .టెన్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన పోటీల్లో అండర్ 17 విభాగంలో పదవ తరగతి విద్యార్థి తిరుపతిరెడ్డి , ప్రసాద్ అండర్ 14 విభాగంలో విభాగంలో 8వ తరగతి చెందిన కే .కార్తీక్ రెడ్డి ,ఎమ్. కార్తీక్ 9వ తరగతికి చెందిన పి .సంతోష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన విద్యార్థులను శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏ.వి.రమణారెడ్డి విద్యార్థులను అభినందించారు .ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వి.శ్రీరామ మ్మూర్తి పి ఈ టి బిజ్జం వికాస్ తదితరులు పాల్గొన్నారు
నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్
బాపట్ల, జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు.ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లాఅటవీ శాఖ అధికారి భీమా నాయక్, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలం నాగం బొట్లపాలెం నరసింహస్వామి ఆలయంలో చోరీ
తాళ్లూరు మండలం నాగం బట్లపాలెంలోని నరసింహ స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, స్థానికుల కథనం ప్రకారం దుండగులు ఆలయంలోని స్టీల్ గేట్ ఆలయానికి సంబంధించిన గంటలు సీసీ కెమెరాలు కొంతమేరకు నగదు అపహరించినట్టు తెలియజేశారు. ఈ ఆలయం ఊరికి బయట కొండమీద ఉండటంతో ఈ ఘటన రాత్రివేళ జరిగిందని ఇదివరకు కూడా ఇలాగే ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు అపహరించారని అక్కడివారు తెలియజేయడం జరిగింది.
కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, స్వతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో భారతదేశానికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని జగ్గి వన్ రామ్ జయంతి సందర్భంగా గొప్ప యోధుడికి మనస్సుమాంజలి తెలియజేసిన బి ఎస్ ఆర్ న్యూస్ అధినేత సాదిక్.