

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
View More
Local Updates
03 Apr 2025 20:45 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతూర్పు గంగవరం పవర్ స్టేషన్ పనులను పరిశీలించిన అధికారులు
తూర్పు గంగవరంలోని నిర్మాణ భాగంలో ఉన్న 132/33 KV పవర్ స్టేషన్ను బుధవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరిగే విధానాన్ని, పవర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే నిర్మాణానికి నాణ్యమైన మెటీరియల్ వాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SE k. వెంకటేశ్వర్లు, EE P. శ్రీనివాసులు, AE V. శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Apr 2025 17:54 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరువెలుగువారిపాలెంలో పశువుల నీటి తొట్లు నిర్మాణం
తాళ్లూరు మండలంలోని వెలుగురిపాలెం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వేసవికాలంలో నీటికి కొరత లేకుండా చూడడమే లక్ష్యమని MPDO దారా హన్మంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, శ్యాగం కొండారెడ్డి, MPP తాటికొండ శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
02 Apr 2025 12:35 PM


No.1 Short News
Reporter Suhelకడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
View More
Local Updates
31 Mar 2025 21:09 PM


No.1 Short News
Newsreadదర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
View More
Local Updates
26 Mar 2025 08:11 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM


No.1 Short News
Newsreadపడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుజరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM


No.1 Short News
Newsreadప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
View More
Local Updates
15 Mar 2025 13:02 PM


No.1 Short News
Newsreadలీడర్: ఇది కదా అసలైన నాయకత్వం, నేనున్నా అనే భరోసా..
ఇప్పటిదాకా నాయకులని చూశాం, వారి పరిధులను చూశాం, కానీ ప్రజల తో మమేకమై, దర్పం ప్రదర్శించకుండా, అతి సాధారణ నైజాన్ని కూడా చూపించే అసలు సిసలు బాధ్యతాయుత నాయకురాలు దర్శి నియోజకర్గ టీడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అనడానికి ఈ చిత్రం ఉదాహరణ గా చెప్పవచ్చు.తన హోదా, పదవి, స్థాయిని పక్కనబెట్టి సాటి మహిళ బాధను పంచుకుంటున్న ఈ చిత్రం దర్శి ప్రజల హృదయాలను ఆకర్షించింది అని చెప్పుకోవచ్చు.
View More
Local Updates
04 Mar 2025 22:37 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంవివాహ రిసెప్సన్ శుభకార్యక్రమం లో పాల్గొన్న టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్
ఈరోజు దర్శి పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో వడ్డమాని శ్రీనివాస శాస్త్రీ - శ్రీమతి వెంకట నాగ భారతి కుమారుని వివాహ రిసెప్సన్ కార్యక్రమం లోని వధువారులు చి|| సత్య భరద్వాజ శర్మ, చి||ల||సౌ|| లలిత ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్ వారితో పాటు టిడిపి సీనియర్ నాయకులు కలువకొలను చంద్ర శేఖర్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దారం సుబ్బారావు ,సుంకర రాఘవరెడ్డి రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:24 AM


No.1 Short News
T Maheshగోరంట్ల గుంతల మయంగా వానవోలు రహదారి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో గుంతలమయంగా వానవోలు రహదారి
గోరంట్ల మండలంలోని గోరంట్ల నుంచి ఉగ్గురాంపల్లి వానవోలు రోడ్డు గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ రోడ్డుపై ఆటోలు రాక తాటిమాకులపల్లె, బాచన్నపల్లి ఉగ్గురాంపల్లి, పెట్లకుంటపల్లి, ఎముకల గుట్లపల్లి ప్రజలు గోరంట్ల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
View More
Local Updates
04 Mar 2025 08:23 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంభారతదేశ మొదటి ముస్లిం మహిళా మంత్రి మాసుమా బేగం వర్ధంతి వేడుకలు
ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో దరిశి రోడ్డునందుగల స్థానిక మజీద్ కు సమీపంలో వున్న HP పెట్రోల్ బంకు ఆవరణలో, ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(సమైక్యాంధ్రప్రదేశ్) మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసి,భారత దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రిగా పనిచేసి, భారత దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిన మసూమా భేగం వర్ధంతి సందర్భంగా, IRCS(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈమె చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు.ఈమె తొలి మహిళా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలవారికి ఎనలేని సేవలందించారని ఈమె చేసిన సేవలను కొనియాడారు.ఈ మె 1952లో,1957లో రెండుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికై, ఒకసారి శాసనసభ ఫ్లోర్ లీడరుగాను,ఇంకోసారి మంత్రిగానూ సేవలందించారని తెలిపారు.ఈమె ప్రముఖ సంఘసేవకురాలు సరోజినీనాయుడు శిష్యురాలిగా వుండి మంచి సంఘసేవకురాలిగా పేరుప్రఖ్యాతులు గఢించారని కపురం శ్రీనివాసరెడ్డి ఈమె సేవాతత్పరతను గురించి సవివరంగా వివరించారు. ఈ కార్య క్రమానికి ముస్లిం సంధానీ,మీరావలి, సైదా, వలి,అశోక్ బాబు,చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Mar 2025 10:19 AM


No.1 Short News
గంగాధర్,అదిలాబాద్ జిల్లాఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పవర్ శిక్షణ తరగతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసి ప్రయాణ ప్రాంగణంలో గత కొద్ది రోజుల నుండి పవర్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి, శిక్షణలో భాగంగా ఆర్టీసిలోని అన్ని శ్రేణులకు చెందినటువంటి ఉద్యోగులను సైతం ఈ శిక్షణలో భాగస్వామ్యం చేసి ఆర్టీసీ అభివృద్ధికి అడుగులు వేస్తుందని ఆదిలాబాద్ ఆర్టీసి డిపో మేనేజర్ కల్పనా తెలిపారు, తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏం.డి వి. సి. సజ్జనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రిజినల్ మేనేజర్ సొలొమాన్ ఈ సందర్బంగా తెలిపారు
View More
Local Updates
03 Mar 2025 09:54 AM
You are offline
Please check your internet connection.
Close