దర్శి: కపురం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమాలు
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా.., ప్రకాశం జిల్లా (ఐఆర్సీయస్)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, దరిశి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చేతన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజన,ప్రకాశం జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూధనరావు,ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ సుజన మాట్లాడుతూ.., సీజనల్ వ్యాదులపట్ల అప్రమత్తంగా వుండాలని సిబ్బందికి సూచించారు.మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక విషజ్వరాలు రాకుండా ప్రతి శుక్రవారం దోమల నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు తెలిపారు.జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఉద్దేశించి కపురం శ్రీనివాసరెడ్ఢి మాట్లడుతూ...., వైద్యులు కనిపించే దేవుళ్ళని,ప్రజలకోసం అహర్నిశలూ శ్రమిస్తుంటారని, ప్రపంచంలో వైద్యుల సేవలు వెలకట్టలేమని కపురం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ డే సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజనను,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూధన్ రావును కపురం శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్నెమ్ లు,ఆశావర్కర్లు,వైద్యశాల సిబ్బంది కలిసి డాక్టర్ చేతన్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి సుబ్బారెడ్డి,దరిశి మలేరియా ఇంచార్జి బసవారెడ్డి,హెచ్.వీ సుహాషిణి,జె.సుశీలమ్మ యావన్మంది వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.