గుంటూరు లో విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై k. తరంగిణి
గుంటూరు, జూలై 2: నగరంలోని ఏటి అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై కె.తరంగిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ తేడాలు, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో, అలాగే సైబర్ క్రైమ్‌కు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా ఆమె ప్రసంగించారు.
ఇలాంటి అంశాలపై మరింతగా తెలుసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఆమె కోరారు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డయల్ చేయాలన్న విషయాన్ని ఆమె ప్రత్యేకంగా వివరించారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భద్రతా పరంగా జాగ్రత్తలు పాటించేందుకు ఉపయోగపడిందని స్కూల్ సిబ్బంది పేర్కొన్నారు.