దర్శి సీఐ ఎస్సై ఆధ్వర్యం లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Y. రామారావు , ఎస్సై M. మురళి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన విద్యార్థులతో చర్చిస్తూ, బాగా చదువుకోవాలని, సమాజంలో క్రమశిక్షణతో ప్రవర్తించాలని, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మీరు చదువులో మెరుగ్గా ప్రవర్తించి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. అలాగే, పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ల మధ్య తేడా ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో పెద్దల సహాయం తీసుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన కల్పించారు. పిల్లలు ఎటువంటి అనుమానాస్పద పరిస్థితిని ఎదుర్కొన్నా భయపడకుండా గురువులకు లేదా పోలీసులకు చెప్పాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, పిల్లల పట్ల ప్రేమతో, శాంతంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎలా మార్గనిర్దేశనం చేయాలో కొన్ని విలువైన సూచనలు చేశారు. చివరిగా, విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ తరఫున పెన్నులు అందజేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.