ఏపీలో ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ!
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.528 కోట్లు ఉంటే.. వాటిలో రూ.350 కోట్లకు పైగా నిధులను వెండర్ల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.178 కోట్ల నిధులను బుధవారం విడుదల చేస్తారు. పది రోజుల్లో మరో రూ.672 కోట్లు విడుదల చేయనున్నారు. కేంద్రం నిధులు ఆలస్యం చేయడంతో గతేడాది డిసెంబర్ నుంచి బిల్లులు ఆగిపోయాయి. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం రూ.900 కోట్లు విడుదలయ్యాయి. తక్కువ చూపించు