దర్శి ;దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దర్శి ఏరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన పంట సాగుదారుల చట్టంపై ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోదర్శి మండల కార్యాలయం నుండి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు మండలంలో జరగనున్న ఈ ప్రచారోద్యమ కార్యక్రమం కౌలు కార్డుల పైన ప్రతి కౌలు రైతుకు అవగాహన కల్పించి ఈ చట్టంపై భూ యజమానులకు ఉన్న అపోహలను తొలగించుటకు భూ యజమానులు నష్టపోకుండా పంట సాగుదారుల చట్టం- 2019 ప్రకారం యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే విధంగా సహకరించాలని రీసర్వ్ డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు తదుపరి పోతవరం పంచాయతీ శివారు ప్రాంతమైన తిమ్మాయిపాలెం గ్రామం మరియు తానం చింతల గ్రామాలలో అలాగే తూర్పు చవటపాలెం గ్రామంలో రైతు సేవ కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఏరియా కోఆర్డినేటర్ నాగమణి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగుదారులు గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది భూమిపై కాదనే విషయాన్ని భూ యజమానులు తెలుసుకొని కౌలు రైతులకు సహకరించాలని కోరారు పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు రుణాలు పొందడానికి కౌలు కార్డు ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కవులు రైతులు ఉన్నారని రాధాకృష్ణన్ రిపోర్టు ఆధారంగా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుని వారు ఉన్నారని రాష్ట్రంలో 75% ఆత్మహత్యలు జరుగుతున్న వారిలో మూడు వంతులు కౌలు రైతులు ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వీఆర్వోలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు భాగస్వాములయ్యారు