దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC)-ప్రకాశం జిల్లా
ముండ్లమూరు తేది :04-07-25
భూ యజమానులు, కౌలు భూములు సాగు చేస్తున్న రైతులకు సహకరించాలి- ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ
----------------@----------------
రాష్ట్ర ప్రభుత్వం భూ యజమానులు నష్టపోకుండా పంట సాగు దారుల చట్టం -2019 చట్టం ద్వారా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చట్టంలో సవరణ చేసినందున భూ యజమానులు కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు వచ్చే లాగున సహకరించలని ముండ్లమూరు తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. శుక్రవారం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వంట సాగు సాగుదారుల ధ్రువీకరణ చట్టం ప్రచారోద్యమం వాహనం ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మాట్లాడినారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్లకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కౌలు రైతుల పంట సాగు దారుల గ్రామస్థాయిలో భూ యజమానుల వద్ద నుండి సాగు చేస్తున్న కౌలు భూముల సాగుపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుంది, భూమిపై కాదని ఈ విషయాన్ని భూ యజమానులు గుర్తుతెరిగి కౌలు రైతులకు సహకరించాలని తెలిపారు. తదుపరి ప్రచార వాహనం ద్వారా ముండ్లమూరు, పసుపుగల్లు, వేముల బండ, రమణారెడ్డి పాలెం, ఈదర, భీమవరం, ఉమామహేశ్వరపురం, పోలవరం గ్రామాలలో కౌలు రైతుల ప్రచారోద్యమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలలో ఆయా గ్రామ సచివాలయ, గ్రామరెవిన్యూ అధికారులు,వ్యవసాయ సహాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు.