ఈరోజు దర్శి ఎంపీడీవో ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహర్షి ఏకలవ్యుడు జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు జీవీ రత్నం మాట్లాడుతూ మహాభారతంలో విలువిద్యలో గురువు లేకుండా విలువిద్య నేర్చుకున్న మహర్షి ఏకలవ్యుడు పాత్ర అమోఘమని గురువు అడిగిన ఎమ్మటేనే తన బొటనవేలును దానం చేసిన త్యాగజీవి మహర్షి ఏకలవ్యుడు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బహుజనుల రచయితల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అట్లూరి రామారావు, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, జూపల్లి కోటేశ్వరరావు, ఎక్స్ ఎంపిటిసి రాజ్పూడి ఇర్మియ, వెంకటేశ్వర్లు, దళిత మహిళలు తదితరులు పాల్గొన్నారు