పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారం చిక్కీలు సరఫరా చేయాలి: APTF తాళ్లూరు.
శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలు ప్రకాశం జిల్లాలో ఏజెన్సీల నుండి సరఫరా లేనందువలన జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు అందించడం లేదు. జూన్ నెలలో కూడా అందరి విద్యార్థులకు అన్ని రోజులకు సరిపడే విధంగా చిక్కీలు సరఫరా చేసి ఉండలేదు. చిక్కీలు సరఫరా చేసే ఏజెన్సీ వారిని సంప్రదించగా పైనుంచి మాకు సరఫరా లేదంటున్నారు. పాఠశాలల్లో పెరిగిన రోల్ ప్రకారము మెగా PTM రోజుకైనా చిక్కీలు పాఠశాలల్లో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను, కూటమి ప్రభుత్వమును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ తరఫున కోరుచున్నాము.