చందలూరు లో చంద్రన్న పచ్చదనం కార్యక్రమం: పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం, దర్శి మండలం చందలూరు గ్రామంలో గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, తన గురువు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో, పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు లకు, లక్ష్మయ్య అద్యక్షతన పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అని సురేష్ అన్నారు. ఒజోన్ పొరను రక్షించాలి అంటే మొక్కలు విరివిగా నాటాలి అని అన్నారు. వాతావరణం లో సమతుల్యత గా ఉండాలి అంటే అందరూ మొక్కలు నాటి పెంచాలి అని, ఎండలు లేకుండా వాతావరణం బాగా ఉండాలి అన్న మొక్కలు పెంచాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో షడ్రక్ , శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.