

No.1 Short News
Newsreadఆదర్శప్రాయుడు హెడ్మాస్టర్ బసవయ్య | కపురం శ్రీనివాసరెడ్డి.
దరిశి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని మండల పరషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య గత నెల(జూన్)30 వ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా...., ఆదివారం దరశిలోని స్థానిక ఆర్యవైశ్య వాసవీ కళ్యాణ మండపంలో ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవానికి ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., ఉపాధ్యాయ వృత్తిలో 39 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరము పాటుబడి,వృత్తిలో అంకితభావం,క్రమశిక్షణ, నిభద్ధతతో పనిచేసి,ప్రజలందరి మన్ననలు పొంది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా ఉపాధ్యాయులకు సేవలందించడమేగాక అనేక సామాజిక సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న అందరివాడు, నిగర్వి,నిత్య కృషీవలుడు,మృధుస్వభావిగా,ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి అందరి మన్ననలు పొంది,ఈ మధ్యన పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు చీదెళ్ళ.బసవయ్య అందరికి ఆదర్శప్రాయుడని కపురం శ్రీనివాసరెడ్డి ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని,తన వ్యక్తిగత ప్రయోజనాలకోసంగాకుండా,దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల ధృష్ట్యా,నిరంతరం బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుబడే వ్యక్తే నిజమైన ఉపాధ్యాయుని,ఈలాంటి వ్యక్తే బసవయ్యని,తన శేషజీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని,పురుషులు ఏ రంగంలో రాణించాలన్నా, తప్పకుండా సహధర్మచారిణి(సతీమణి) అంగీకారం,సహకారం ఉండాలని, యావన్మంది మేధావులు,విద్యావంతులందరి సమక్షంలో కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.మహోన్నతమైన విలువలతో స్థాపించబడ్డ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కు బసవయ్య లాంటివారి సహయ సహకారాలు అవసరము కాబట్టి, మానవత సంస్థలో ఆయన స్థాయికి తగిన సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తామని,బసవయ్య లాంటి వ్యక్తులు ప్రస్తుతం ఈ సమాజానికి చాలా అవసరమని కపురం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,సిద్ధా సుధీర్, ఎంఈవోలు రఘురామయ్య,రమాదేవి, పీ.సంజీవయ్య,సూరె. సుబ్బారావు,వాకా.జనార్ధన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,పురప్రముఖులు పాల్గొన్నారు.
Latest News
07 Jul 2025 15:48 PM