ప్రజలకు అండ తెలుగుదేశం జెండా: డా|| గొట్టిపాటి లక్ష్మి
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణం లోని కురిచేడు రోడ్డులో గల ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం లో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని 12వ వార్డులో ఇంటింటికి ఏడాది పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. డా|| లక్ష్మీ గారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర నాయకులు ఉన్నారు.