చంద్రన్న పచ్చదనం–భాష్యం స్కూల్లో మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
చంద్రన్న పచ్చదనం కార్యక్రమం లో భాగంగా, గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, గురువు అచ్చెన్నాయుడు ఆసీస్సులతో, దర్శి భాష్యం స్కూల్, నందు టీడీపీ ప్రకాశం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఏర్పాటు చేసిన మొక్కలను దర్శి అగ్రికల్చర్ AO k.రాధ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో K .రాధ మాట్లాడుతూ పిల్లలందరూ గ్రీన్స్ లీడర్ గా ఎదగాలి అని , ప్రకృతి, చెట్లు పర్యావరణ కు తొలి మెట్లు అని పిల్లల తో అన్నారు. కరోనా సమయంలో ఆక్సీజన్ అందక చాలా మంది చనిపోయినారు అని, అదే మన ఇంటి ఆవరణ లో చెట్లు ఉంటే ఆక్సిజన్ అందేది అని వివరించారు. చెట్లు పెంచడం వల్ల కాయలు పండ్లు, నీడ అన్ని దొరుకుతాయి అని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీష్,స్మైలీ, సుజాత, సుకన్య, సరస్వతి, అశోక్,రావులపల్లి ఉపాధ్యాయులు, స్టాఫ్ పాల్గొన్నారు..