దర్శి లో మంద కృష్ణ మాదిగ 60 వ జన్మదిన వేడుకలు - కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
మందకృష్ణ మాదిగ లాంటి పోరాట యోధుడు పేదలు బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిరంతరం వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. గత ఐదేళ్ల వైసిపి విధ్వంసం పాలనను తరిమికొట్టాలని మన కూటమి కి అండగా నిలిచిన ప్రజల మనిషి మందకృష్ణ మాదిగ అని లక్ష్మి కొనియాడారు. ఎన్నికల సమయంలో దొనకొండలో మాదిగల ను ఏకం చేసేందుకు నాకు అండగా ప్రచారాన్ని కూడా వచ్చిన మందకృష్ణ మాదిగ ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె అభిప్రాయపడ్డారు.
అదే స్ఫూర్తితో మన కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతుందని ఆమె వివరించారు. గౌరవ నరేంద్ర మోడీ ఆయన కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును కూడా మందకృష్ణ మాది కి ఇచ్చి గౌరవించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ MRPS కన్వినర్ గూడూరి యోగేశ్వరరావు మరియు ముండ్లమూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరగాని పౌలు తెల్లయ్య గారు దొనకొండ మండల MRPS కన్వినర్ యగ్గోని చిన్నయ్య గారు దొనకొండ మండల లైవ్ స్టాక్ అధ్యక్షులు పల్లే మణీందర్ దేవ్ గారు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు నూనే డేవిడ్ సన్ గారు దర్శి టౌన్ 15వ వార్డు అధ్యక్షులు పుప్పాల సురేష్ తెలుగుదేశం పార్టీ మరియు MRPS కార్యకర్తలు పాల్గోన్నారు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.