కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా మండలంలో నివాళులర్పించే నాయకుడే లేడని వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమంటే మేమని ఎగబడి నాయకులు కేకులు కట్ చేయడం, పూలదండలు వేయడం పోటీపడి చేసేవారు. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పట్టించుకోవడం కూడా కరువైపోయిందని అధికారం ఉంటేనే అభిమానం ఉంటుందా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోవడమే తప్ప మహానేతకు కనీసం నివాళులు అర్పించే నాయకులు లేరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.