ఏళ్ల తరబడి తిరిగిన సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్
మండలంలోని సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని నరసన్న పల్లె, చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండపురం గ్రామాల ఎస్సీ మాదిగలకు భూములు చూపడం లో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కు బాధితులతో కలిసి అర్జీ లు ఇవ్వడం జరిగింది.