గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ప్రారంభం
ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ప్రారంభం.విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం పోలీస్ చర్యలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మార్గనిర్దేశనలో,గుంటూరు జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ సేవ్ క్యాంపస్ జోన్ అనే ప్రత్యేక డ్రైవ్‌ను 08.07.2025 తేదీ నుండి 12.07.2025 తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ది.08.07.2025) జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులు, బడ్డీ కొట్టులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై దృష్టి సారించారు. అనుమానిత విక్రయదారులపై తగిన విధంగా చర్యలు తీసుకొని, ఇకపై మత్తు పదార్థాలు అమ్మకుండా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. పాఠశాలలు, కాలేజీల సమీపంలో ఈ తరహా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దాడులు కొనసాగుతాయి.ఎవరైనా మత్తు పదార్థాలు నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.
విద్యాసంస్థల పరిసరాలలోని షాపుల యజమానులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ షాపులో సిగరెట్లు మరియు మత్తు పదార్థాలు అమ్ముబడవు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, కాలేజీల యాజమాన్యం వారు తమ పిల్లల ప్రవర్తన మరియు నడవడికపై పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు.
ఎవరి పిల్లలైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్టు తెలిసినట్లయితే, వెంటనే మీ దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని, వీరిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి అవసరమైన మార్గదర్శనం అందిస్తామని తెలిపారు.
పోలీసు శాఖ మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పని చేస్తోందని, ప్రజలు ఈ లక్ష్య సాధనలో పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు.