ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ను మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం
విజయవాడ, జూలై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష ని విజయవాడలోని హజ్ హౌస్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ, రాష్ట్రంలోని హాజీబంధువుల కోసం హసన్ భాష చేస్తున్న అద్భుత సేవలు, సమన్వయం, మరియు సమగ్ర దృక్పథం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన వసతి, భద్రత, రవాణా, వైద్య సదుపాయాల కల్పనలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంపై కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా కడపలోని హజ్ హౌస్ ను వినియోగంలోకి తీసుకురావాలని మరియు హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు విజయవాడ పాయింట్ గా సూచించాలని ఆమె కోరారు, హసన్ భాషా సానుకూలంగా స్పందించి ఈ విషయాలను నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కడప హజ్ హౌస్ వినియోగంలోకి తీసుకుని వచ్చేదానికి అదేవిధంగా విజయవాడను ఎమ్బర్కేషన్ పాయింట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు...
అదేవిధంగా, హజ్ కమిటీ చైర్మన్‌గా హసన్ భాష చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఆయనకు సత్కారం జరిపి, శాలువాతో సన్మానించడం జరిగింది. భవిష్యత్తులోనూ హజ్ యాత్రికుల కోసం మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.