ముండ్లమూరు: పోలవరం లో పోలీసుల దాడి 10 మంది అరెస్ట్.
ప్రకాశం జిల్లా: ముదురుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో, జిల్లా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, మార్గదర్శకత్వంలో, ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
దాడి సమయంలో వారి వద్ద నుంచి రూ.10,190/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిపై సంబంధిత నేర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మరింత విచారణ కొనసాగుతోంది.
పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, ఇటువంటి చర్యలు ఇంకా కఠినంగా కొనసాగిస్తామని తెలిపారు.జనసామాన్యులు తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.