శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో రేపు గురుపూజ మహోత్సవ కార్యక్రమం
కడప జిల్లా
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు అనగా10.07.2025 గురువారం గురుపూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఎనిమిదో తరం మనవడు శ్రీ వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఈ గురుపూజ మహోత్సవాలకు స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ , మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు