

No.1 Short News
DR Local News - Chiralaకన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి సాగర హారతి: బంగారు బాబు
బాపట్ల జిల్లా,చీరాల మండలం,వాడరేవు గ్రామం (సముద్ర తీర ప్రాంతం) నందు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన ఆషాడ పౌర్ణమి, గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా, అత్యంత వైభవో పేతంగా సామూహిక పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ శర్మ గార్ల మంత్రోచ్ఛారణతో స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం మరియు సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా
బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు గారు, కొండారెడ్డి గారు, అనిల్ గారు పాల్గొని వీరి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతిని నిర్వహించుట జరిగినది.
ఈ సందర్భంగా....
బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారు మాట్లాడుతూ.... సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సముద్ర హారతి ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలు పెట్టిన తర్వాత వాడరేవు హైవే పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులు ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు అభినందనీయమని వారిని ప్రశంసించటం జరిగినది.
హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహo గారు గురు పౌర్ణమి గురించి వివరించుట జరిగినది.
సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర హారతి చీరాల వాడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని , త్వరలో మరకత శివ లింగం తో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు .
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు మరియు చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య గారికి, పోలీస్ సిబ్బంది వారికి, వాడరేవు పంచాయతీ సిబ్బందికి , భజన బృందం వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ,మనోహర్ రెడ్డి,మణి కుమార్, భవానీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి , దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, పిక్కి రాంబాబు , కోటి శ్రీను , జంపాల చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్,సతీష్ వులిచి, మూర్తి జొన్న,
పిక్కి నారాయణ, గోలి సాంబశివ రావు, బుర్ల సాంబశివరావు ,తడవర్తి చంద్ర , రాజేష్ ,డాక్టర్ సబరి , గుమ్మ బాలాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ చైతన్య వేదిక వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వాడరేవు టిడిపి నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
Local Updates
11 Jul 2025 11:14 AM