ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 22వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని, ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141 అని తెలిపారు.