ఏపీ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి నియామకం
ఏపి నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా తాళ్లూరు మండల మాజీ టిడిపి అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ని నియమించినందుకు శనివారం డా|| లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కి, టిడిపి సీనియర్ నాయకులు కడియాల రమేష్ లను శాలువాలు, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి తో పాటు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.